Cooked Rice Water : గంజి తాగడం వల్ల కలిగే లాభాలు ?
బియ్యం నీరు లేదా అన్నం వండిన తర్వాత మిగిలిపోయిన పిండిలాంటి ద్రవం లేదా గంజి అనేక ప్రయోజనాలతో కూడిన సంప్రదాయ ఔషధం. కాగా ఈ వండిన అన్నం నీటిని రోజూ మీ డైట్ లో చేర్చుకుంటే పూర్తి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని
దిశ, ఫీచర్స్ : బియ్యం నీరు లేదా అన్నం వండిన తర్వాత మిగిలిపోయిన పిండిలాంటి ద్రవం లేదా గంజి అనేక ప్రయోజనాలతో కూడిన సంప్రదాయ ఔషధం. కాగా ఈ వండిన అన్నం నీటిని రోజూ మీ డైట్ లో చేర్చుకుంటే పూర్తి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ గురించి వివరిస్తున్నారు.
శక్తి మెరుగుదల
బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నీటిని తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు. శక్తి స్థాయిలను తిరిగి నింపుకోవడంలో హెల్ప్ చేస్తుందని.. ముఖ్యంగా వ్యాయామం తర్వాత లేదా అలసట సమయంలో తీసుకోవడం ఎనర్జీని త్వరగా గెయిన్ చేసేందుకు సాయపడుతుందని అంటున్నారు.
సరైన జీర్ణక్రియ
డయేరియా, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు గంజి సహజ నివారిణిగా పనిచేస్తుంది. ఇందులోని ఓదార్పు గుణాలు ప్రేగు కదలికలను నియంత్రించడంలో, గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
హైడ్రేషన్
అవసరమైన పోషకాలతో నిండిన రైస్ వాటర్ అనేది హైడ్రేటింగ్ డ్రింక్. కాగా ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణం లేదా అనారోగ్యం సమయంలో శరీరం నిర్జలీకరణం కాకుండా చూస్తుంది.
పోషకాలు సమృద్ధి
వండిన అన్నం నీటిలో జీవక్రియ, మెదడు పనితీరుకు అవసరమైన B1, B2, B6 వంటి విటమిన్లు ఉంటాయి, అలాగే మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
చర్మ ఆరోగ్యం
గంజి నీరు... శీతలీకరణ మరియు శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. రైస్ వాటర్ తాగడం లేదా అప్లై చేయడం వల్ల చర్మపు చికాకులను తగ్గిస్తుంది. స్కిన్ టోన్
మెరుగుపరుస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది.
బీపీ కంట్రోలర్
బియ్యం నీటిలోని పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తపోటు నియంత్రణలో హెల్ప్ చేస్తుంది.
రోగ నిరోధక శక్తి
బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి.
బరువు నియంత్రణ
బియ్యం నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఆకలిని నియంత్రించడంలో, అతిగా తినడం తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం
రైస్ వాటర్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ మృదువైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.