వేసవిలో మట్టికుండలో నీరు తాగితే బోలెడు లాభాలు

ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా.. నంబర్ ఆఫ్ ఫీచర్స్‌తో రిఫ్రిజిరేటర్స్ డెవలప్ చేసినా.. మట్టి కుండ ప్రత్యేకతే వేరు. అందులోని నీరు

Update: 2024-04-06 03:33 GMT

దిశ, ఫీచర్స్: ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా.. నంబర్ ఆఫ్ ఫీచర్స్‌తో రిఫ్రిజిరేటర్స్ డెవలప్ చేసినా.. మట్టి కుండ ప్రత్యేకతే వేరు. అందులోని నీరు తాగితే వచ్చే మజానే వేరు. కానీ పట్టణీకరణలో పడిపోయి హెల్తీ హ్యాబిట్స్ మానేసి రిచ్‌నెస్ మెయింటెన్ చేసేందుకు ఫ్రిడ్జ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్యే ఎక్కువ. కాగా మట్టి కుండలో నీటిని తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే ఆ పని చేయబోరని అంటున్నారు నిపుణులు. పైగా ఫ్రిడ్జ్ వాటర్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. కుండ నీరు వాటిని హీల్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలేంటో వివరంగా తెలుసుకుందాం.

ఈ కుండను బంకమట్టితో తయారు చేస్తారు. సహజ ఆల్కలీన్‌గా చెప్పబడే ఇది.. నిల్వ చేసిన నీటి పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతూ జీర్ణ సమస్యలను దరి చేరనీయదు. ఇందులోని నేచురల్ మినరల్స్ జీవక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించి.. బరువు తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. వేసవిలో తలెత్తే కంటి సమస్యలు, అలెర్జీ నుంచి కాపాడుతుంది. శరీరంలోని గాయాలను హీల్ చేయడంతోపాటు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరంగా ఉంచుతుంది.

నిజానికి రిఫ్రిజిరేటర్ వాటర్ చాలా మందికి గొంతు నొప్పిని కలిగిస్తాయి. కానీ మట్టి కుండలోని నీరు ఈ ప్రాబ్లమ్స్‌ నుంచి హీల్ చేస్తుంది. మండే ఎండల్లో ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. కానీ నొప్పి తీవ్రమైతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. వారు చూపిన మెడికేషన్ తప్పకుండా ఫాలో అవాలి కూడా.


Similar News