Benefits for Mushrooms : పుట్టగొడుగుల్లోని ఆ పోషకాలు.. డైట్‌లో చేర్చుకుంటే జరిగే మార్పులివే..

Benefits for Mushrooms : పుట్టగొడుగుల్లోని ఆ పోషకాలు.. డైట్‌లో చేర్చుకుంటే జరిగే మార్పులివే..

Update: 2024-10-22 07:46 GMT

దిశ, పీచర్స్ : ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఆహారాల్లో పుట్టుగొడుగులు కూడా ఒకటి. వీటిలో బటన్ మష్రూమ్, షిటేక్, పోర్టోబెల్లో, రిషి వంటి పలు రకాలు ఉంటాయి. అయితే వీటిని తరచుగా తినడంవల్ల అందులోని పోషక విలువలు పలు వ్యాధులను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే డైట్‌లో భాగంగా చేర్చుకున్నప్పుడు వాటివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

* ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి : పుట్టగొడుగుల్లో బీటా - గ్లూకాన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు, వివిధ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా వీటిలోని సెలీనియం అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌‌తో పోరాడి నొప్పి, మంట వంటి సమస్యలను నివారిస్తుంది.

* జీర్ణ వ్యవస్థపై ప్రభావం : పుట్టగొడుగుల్లో ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉంటుంది. ఇది అధికబరువు, ఊబకాయం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి, కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి ఇబ్బందులను నివారిస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలిగించడంవల్ల అతిగా తినే అలవాట్లను కూడా నిరోధిస్తుంది. అలాగే మష్రూమ్స్‌లో ఉండే ప్రోటీన్లు కండరాల బలోపేతానికి చాలా ముఖ్యం.

* క్యాన్సర్ కణాల నిరోధకత : మష్రూమ్స్‌లో పాలీ శాకరైడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటంవల్ల ఈ వ్యాధి నివారణలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో భాగంగా రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రిషి, షీటేక్ వంటి పుట్టగొడుగు రకాల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు ఇటీవల పరిశోధనల్లో కూడా తేలింది. కాబట్టి వీటిని తీసుకోవడం ప్రొస్టేట్, కోలన్, చెస్ట్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నివారణలో అద్భుతంగా సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News