షాకింగ్ న్యూస్ : టీనేజ్‌లో ప్రెగ్నెంట్ అయితే అకాల మరణం తప్పదంట!
తాజాగా జరిగిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. టీనేజ్‌లో ఉన్న యువతుల మరణాల రేటు అధికంగా ఉందని, ముఖ్యంగా యుక్త వయసులో ప్రెగ్నెన్సీ, యువతుల అకాల మరణాలకు
దిశ, ఫీచర్స్ : తాజాగా జరిగిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. టీనేజ్‌లో ఉన్న యువతుల మరణాల రేటు అధికంగా ఉందని, ముఖ్యంగా యుక్త వయసులో ప్రెగ్నెన్సీ, యువతుల అకాల మరణాలకు కారణం అవుతుందని నిపుణులు తెలిపారు. 16 ఏళ్ల లోపు గర్భం దాల్చిన వారికే ఈ ప్రమాదం ఎక్కువ ఉన్నదంట.
యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ వారు కెనడాలోని ఏప్రిల్ 1, 1991 నుంచి మార్చి 31, 2021 మధ్య పుట్టిన 2.2 మిలియన్ల మహిళా టీనేజర్లను స్టడీ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీనేజ్ సమయంలో ఒక గర్భం దాల్చిన వారు అకాల మరణంతో చనిపోయే రేటు 1.5 ఉండగా,రెండు లేదా అంతకంటే ఎక్కువ గర్భాలు ఉన్నవారిలో 2.1 రెట్లు అకాల మరణాలు ఉన్నట్లు తేలింది. అయితే వీరు చిన్న వయసులోనే సెక్స్, తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో అధిక రక్తస్రావం, రక్తపోటు సర్వైకల్ క్యాన్సర్, గర్భధారణ సమయంలో మరణాల వలన మరణిస్తున్నారు. అంతే కాకుండా యువత ఎక్కువగా సూసైడ్ చేసుకోవడానికి కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీనే కారణం అంటున్నారు నిపుణులు. కుటుంబం, తన ఫ్రెండ్స్ వద్ద వారు ఓపెన్‌గా చెప్పలేక, గర్భం దాల్చితే ఎవరి సపోర్టు ఉండకపోవడంతో మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకుంటున్నారంట.
అయితే ఇలాంటి మరణాలు తగ్గాలంటే టీనేజ్‌లో గర్భధారణపై యువతులతో పాటు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సర్వేలు చెబుతున్నాయి. అవాంఛిత సెక్స్, గర్భనిరోధక మాత్రలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అదే విధంగా బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భం దాల్చిన, అనుకోకుండా యువతి ప్రెగ్నెన్సీ అయినా తనకు తోటి వారు మద్ధతు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.