వాటి బొచ్చుతో వ్యాపారం చేయాలని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.. కానీ ఇప్పుడు విధ్వంసం సృష్టిస్తున్నాయ్..

అవి చూడటానికి ఒక పెద్దసైజు ఎలుకల్లా కనిపింజే జీవులు. ఉత్తర అమెరికా, యూరప్‌తోపాటు ఆసియా ఖండంలోని పలు దేశాల్లో తరచుగా కనిపించేవి. చిలీ, అర్జెంటీనాలో మాత్రమే కనిపించేవి కావట.

Update: 2024-05-21 08:00 GMT

దిశ, ఫీచర్స్ : అవి చూడటానికి ఒక పెద్దసైజు ఎలుకల్లా కనిపింజే జీవులు. ఉత్తర అమెరికా, యూరప్‌తోపాటు ఆసియా ఖండంలోని పలు దేశాల్లో తరచుగా కనిపించేవి. చిలీ, అర్జెంటీనాలో మాత్రమే కనిపించేవి కావట. దీంతో ఈ దేశస్థులు 1946లో కెనడా దేశం నుంచి ఒక 50 జీవులను స్పెషల్ హెలికాప్టర్‌లో తమదేశానికి తీసుకు వచ్చి టియెర్రా డెల్ ఫ్యూగో ద్వీపంలో వదిలారు. ఇది చిలీ వరకు విస్తరించి ఉంది. అయితే అర్జెంటీనా తీసుకొచ్చిన ఆ జీవుల పేరు బీవర్లు.

అర్జెంటీనా బీవర్లను తీసుకు రావడం వెనుక ప్రధాన ఉద్దేశం వాటి బొచ్చుతో వ్యాపార పరిశ్రమ సృష్టించి డబ్బులు సంపాదించడం. వ్యాపారం ఏమో కానీ ప్రస్తుతం ఇవి చిలీ, అర్జెంటీనా దేశాలకు పెద్ద సమస్యగా మారాయి. ఎందుకంటే అవి కత్తిలాంటి తమ పళ్లతో భూభాగంలో పెద్ద ఎత్తున సొరంగాలు తవ్వుతూ.. అడవుల్ని నాశనం చేస్తూ, నదులను దారి మళ్లిస్తూ ప్రకృతి విధ్వంసానికి కారణం అవుతున్నాయి.

సుమారు రెండు అడుగుల పొడవు, 16 నుంచి 50 కిలల బరువు ఉండే బీవర్లవల్ల చిలీ, అర్జెంటీనాలో ఇప్పటికే వందల కిలోమీటర్ల మేరకు అడవులు ధ్వంసం మయ్యాయి. సహజ నీటి వనరులు దారిమళ్లాయి. టియెర్రా డెల్ ఫ్యూగో ద్వీపంలో అయితే ఇవి 60 వేలకంటే ఎక్కువగా చిన్నా, పెద్ద సొరంగాలను, ఆకనకట్టలను పేర్చడం ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లేలా చేశాయట. దీంతో అప్రమత్తమైన ఆ రెండు దేశాలు బీవర్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. భవిష్యత్తులో వాటిని ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళికలు రూపొందించడంలో చిలీ, అర్జెంటీనా దేశాలు నిమగ్నం అయ్యాయి.


Similar News