Oils: అందం.. ఆరోగ్యానికి ఈ నూనెలు బెస్ట్!

వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెను ఉపయోగిస్తుంటారు.

Update: 2024-12-03 07:41 GMT

దిశ, ఫీచర్స్: వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెను ఉపయోగిస్తుంటారు. వంటకాల రుచిని పెంచడంలో నూనెలు ముందుటాయి. అలవాట్లు, ప్రాంతాన్ని బట్టి నూనెలు వాడడం మారుతుంటాయి. కేవలం వంటలకు మాత్రమే కాకుండా సౌందర్యాన్ని పెంచి, ఆరోగ్యానికి మేలు చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషకాల వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, అలాంటి నూనెలు ఏమిటో ఇక్కడ చదివేయండి మరి.

పల్లీ నూనె: పల్లీలు ప్రతీ ఒక్కరి వంట గదిలో దర్శనమిస్తాయి. ఇవి టేస్టీగా ఉండడమే కాదు, ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశనగల్లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రొటీన్లు, సోడియం ఇలా చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి కూడా ఉపమోగపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ - ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీంతోపాటుగా చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్‌: ఇది వంటకాల్లో మాత్రమే కాదు సౌందర్య పోషణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ నూనెతో చర్మంపై మర్ధనా చేయడం వల్ల స్కిన్ తాజాగా, మృదువుగా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులు ఉన్న వారు ఈ ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ఆవ నూనె: ఈ నూనె వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో హెల్దీ ఫ్యాటీ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రోక్ రాకుండా కాపాతుంది. అంతేకాదు ఈ నూనెతో శరీరానికి మర్ధన చేయడం వల్ల శరీరంలో రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల అలసట తగ్గుతుంది. ఇది మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చక్కగా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు పోషణ ఇవ్వడమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తు్ంది. ఇందులో ఖనిజాలు, ఇనుము, జింక్ వంటివి ఉంటాయి.

అయితే, నూనెలు ఎంత మంచివైనా సరే వాటిని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది. ప్రతీ సారి ఓకే రకమైన నూనెను వాడడం వల్ల కేవలం వాటిలోని పోషకాలు మాత్రమే అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రీఫైన్ చేసిన నూనెలు ఆరోగ్యానికి హానీ కలిస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News