Be careful: బీ కేర్ ఫుల్.. సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా?

చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది.

Update: 2024-09-30 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ క్షణాన్ని సిగరెట్ ప్రియులు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. పనిలో అలసిపోయి రిఫ్రెష్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ రకంగా సిగరెట్ తాగే వారు ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోతున్నారు. కానీ స్మోక్ చేస్తూ టీ తాగడం ఎంత పెద్ద రిస్కో గ్రహించలేకపోతున్నారని తాజాగా ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ అలవాటు ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేసే వారికి గుండెపోటు వచ్చే చాన్స్ మూడు రెట్లు ఎక్కువ. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రీసెంట్‌గా ఒక పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. టీ లో ఉన్నటువంటి టాక్సిన్‌ సిగరెట్ పొగలో కలిస్తే చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఉదా.. జ్ఞాపకశక్తి చేతులు, కాళ్లలో గ్యాంగ్రీన్ కోల్పోవడం, గుండె, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు, ఊపిరితిత్తుల్లో కుంచించుకుపోవడం, సంతానలేమి సమస్య, కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News