వృద్ధాప్యంలో వినికిడి శక్తి కోల్పోతున్న గబ్బిలాలు

ఈ భూమీ మీద నివసించే ప్రాణుల్లో అద్భుతమైన జీర్ణ వ్యవస్థ కలిగివున్న ప్రాణి గబ్బిలం.

Update: 2023-04-13 10:13 GMT

దిశ, ఫీచర్స్: ఈ భూమీ మీద నివసించే ప్రాణుల్లో అద్భుతమైన జీర్ణ వ్యవస్థ కలిగివున్న ప్రాణి గబ్బిలం. కుళ్లిన ఆహారం తింటూ పర్యావరణానికి మేలు చేసే ఈ క్షీరదం గురించి వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకుల తాజా పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైఫ్ సైన్స్ అలయన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. చాలా క్షీరదాలు వయస్సు పెరిగే కొద్దీ వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

కానీ ఇప్పటి వరకు ఎకోలొకేషన్(ఒక ప్రాణి ఒక వస్తువు నుంచి బౌన్స్ అయ్యే ధ్వని తరంగాన్ని విడుదల చేసినప్పుడు.. ప్రతిధ్వని ద్వారా వస్తువు యొక్క దూరం, పరిమాణం తెలుసుకోగలుగుతాయి) కలిగిన గబ్బిలాలు ఇందుకు మినహాయింపు అని భావించారు శాస్త్రవేత్తలు. అయితే మనుషుల్లాగే గబ్బిలాలు కూడా వయసు పెరిగే కొద్దీ వినికిడి శక్తిని కోల్పోతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. అలాగే అత్యధిక సౌండ్ పొల్యూషన్ కలిగివున్న ప్రాంతాల్లో మనుషులు త్వరగా వినికిడి కొల్పోయినట్లే గబ్బిలాలపై కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ అధ్యయనంలో శ్రవణ మెదడు వ్యవస్థ ప్రతిస్పందనతోపాటు కోక్లియర్ మైక్రోఫోనిక్స్ ఉపయోగించి 47 గబ్బిలాల వినికిడిని పరిక్షీంచారు. ఇందులో గబ్బిలాలలో వినికిడి క్షీణత రేటు మానవుల మాదిరిగానే సంవత్సరానికి ~1 dB స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. మానవుల మాదిరిగానే గబ్బిలాలు వాటి కోక్లియా నిర్మాణం, పనితీరులో వయస్సు-సంబంధిత క్షీణతను అనుభవిస్తాయని.. అలాగే శ్రవణ నాడి ప్రాసెసింగ్ వేగం తగ్గుతుందని తదుపరి పరీక్షలు సూచిస్తున్నాయి. కాగా

కోక్లియా అనేది లోపలి చెవిలో కనిపించే బోలు, మురి ఆకారపు ఎముక. ఇది వినికిడి కోణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆడిటరీ ట్రాన్స్‌డక్షన్ ప్రక్రియలో పాల్గొంటుంది. ధ్వని తరంగాలు విద్యుత్ ప్రేరణలుగా ప్రసారం చేయబడతాయి. బ్రెయిన్ వీటిని సౌండ్ ఇండివిడ్యువల్ ఫ్రీక్వెన్సీస్‌గా అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లోకి పిచుకలు రావడం మంచిదేనా? 

Tags:    

Similar News