రెండో రోజు అటుకుల బతుకమ్మ స్పెషల్ ఏంటో తెలుసా?
బతుకమ్మ పండుగ మొదలైంది. వాకిల్ల ముందు ఆడబిడ్డలందరూ కలిసి ఆనందంగా బతుకమ్మను ఆడుకుంటుంటారు. ప్రతి వాడ వాడకు రామ.. రామ.. ఉయ్యాలో
దిశ, వెబ్‌డెస్క్ : బతుకమ్మ పండుగ మొదలైంది. వాకిల్ల ముందు ఆడబిడ్డలందరూ కలిసి ఆనందంగా బతుకమ్మను ఆడుకుంటుంటారు. ప్రతి వాడ వాడకు రామ.. రామ.. ఉయ్యాలో అనే రాగం వినబడుతూనే ఉంటుంది. అయితే ఈరోజు రెండో రోజు బతుకమ్మ, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు ఎంత ప్రత్యేకత ఉంటుందో, రెండో రోజుకూడా అంతే ఉంటుంది. ఈ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటుంటారు.
ఈరోజు దేవీశరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ తరువాత రోజు పిల్లలే ఎక్కువగా బతుకమ్మ ఆడుకునేవారట. అమ్మవారికి నైవేద్యంగా అటుకులు, బెల్లం పెట్టేవారు. అందువలన ఈరోజును అటుకుల బతుకమ్మ అంటారు.