Bone health :ఈ అలవాట్లను వెంటనే మానుకోండి.. లేదంటే మీ ఎముకలు బలహీనంగా అవుతాయి?
మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లను, విటమిన్లను సమయానికి తీసుకోవాలి .
దిశ, వెబ్ డెస్క్ : మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లను, విటమిన్లను సమయానికి తీసుకోవాలి . మొదట్లో దీని ప్రభావం అంతగా లేక పోయినప్పటికీ కానీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. రోజువారీ జీవితంలో మనం మన పనుల్లో బిజీగా గడుపుతుంటాం. అలా మనకు తెలియకుండానే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించి.. అనారోగ్య సమస్యలను కోరి కొని తెచ్చుకుంటాము. సాధారణంగా చిన్న పని చేసినా అలసిపోవడం.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాము. దీనికి ముఖ్య కారణం ఎముకలు బలహీనంగా ఉండటమే.ఈ అలవాట్లతో ఎముకలను బలంగా చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. ప్రతి రోజు యోగా వంటి వాటిని చేస్తూ ఉండాలి. లేదంటే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. మీరు నడకతో పాటు కొన్ని వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి.
2. తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి. పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోకపోవడమే మంచిది. ఉప్పులో ఉండే సోడియం వల్ల శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనం అవుతాయి.
3. స్మోకింగ్ ఊపిరితిత్తుల పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే దీన్ని మానుకోండి.