Sunitha Williams : అంతరిక్షంలో వ్యోమగాముల టాయిలెట్ కష్టాలు వర్ణణాతీతం.. ఇక పడుకునే చోటు అయితే దారుణం..

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5న ప్రత్యేకంగా తయారు చేసిన వ్యోమనౌక స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు. పర్యటన పూర్తి చేసుకుని ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సింది. కానీ అలా జరగలేదు. సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

Update: 2024-08-10 15:08 GMT

దిశ, ఫీచర్స్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5న ప్రత్యేకంగా తయారు చేసిన వ్యోమనౌక స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు. పర్యటన పూర్తి చేసుకుని ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సింది. కానీ అలా జరగలేదు. సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. 15 రోజులు, 20 రోజుల్లో తీసుకువస్తామని ఎప్పటికప్పుడు చెప్తూ కాలయాపన చేసిన NASA, బోయింగ్ కంపెనీ.. ఇంకా ఆరు నెలలు పట్టేలా ఉందని చెప్తుంది. అంతేకాదు ISS చేరుకోకముందే ఈ స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీక్ ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇందులోనే మళ్లీ తిరుగుప్రయాణం సేఫ్ కాదని నిర్ణయించిన శాస్త్రవేత్తలు.. ఇందుకోసం మరో వ్యోమ నౌకను సెప్టెంబర్ లో అక్కడికి పంపేందుకు నిర్ణయించారు. అంటే 2025 ఫిబ్రవరిలో ఈ ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో భారీ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌకర్యాలు, పరిశుభ్రత, ఆహారం, ఆరోగ్యం.. ఇలా అన్ని విషయాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్రమంలో కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇరుకైన స్లీపింగ్ క్వార్టర్స్

ఆస్ట్రోనాట్స్ హార్మోని మోడ్యూల్ లో ఉన్న చిన్న స్లీప్ స్టేషన్స్ లో నిద్రిస్తారు. ఇవి ఫోన్ బూత్ పరిమాణంలో ఉంటాయి. ఈ స్టేషన్స్ ప్రైవసీ, చీకటిని అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడగా.. గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి సవాలుగా మారుతున్నాయి. నిద్రించడానికి బదులు ఈ బాక్స్ లో కూర్చునే పరిస్థితి నెలకొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

వాక్యూమ్ పవర్ టాయిలెట్స్

ISS స్పెషల్ టాయిలెట్స్ కలిగి ఉంది. వీటిని ఆర్బిటాల్ అవుట్ హౌజ్ లు అనిపిస్తుంటారు. ఇది ట్రాంక్విలిటీ మోడ్యూల్ లో ఉంది. టాయిలెట్స్ వ్యర్థాలను నిర్వహించేందుకు ఫ్యాన్ తో నడిచే వాక్యూమ్ ను ఉపయోగిస్తారు. యూరిన్ ఒక గరాటుతో గొట్టం ద్వారా సేకరించబడుతుండగా.. ఘన వ్యర్థాలు మూతతో చిన్న రంధ్రం ద్వారా పారవేయబడుతాయి.

వ్యక్తిగత శుభ్రత కష్టమే

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో రోజువారీ వ్యక్తిగత పరిశుభ్రత పనులు గురుత్వాకర్షణ లేకపోవడం కారణంగా క్లిష్టంగా ఉంటాయి. షవర్ కుదరదు కాబట్టి వ్యోమగాములు శుభ్రం చేసిన తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకుంటారు. జుట్టుకు రిన్స్ లెస్ షాంపూ వాడుతారు. ఇక బ్రషింగ్ విషయానికి వస్తే.. పేస్ట్ మింగాలి లేదంటే పేపర్ టవల్ లో ఉమ్మివేయాలి.

డీహైడ్రేటెడ్ మీల్స్

వ్యోమగాములు నీటిలో రీహైడ్రేట్ చేయబడిన, మైక్రోవేవ్ లో వేడి చేసిన డిహైడ్రెట్ భోజనాన్ని తీసుకుంటారు. వీరు ప్రతిరోజూ కనీసం 2500 కేలరీల ఆహారం తినాలి. తరుచుగా కలిసి భోజనం చేసే అవకాశం ఉండదు. కొంచెం సేద తీరేందుకు మందు అనుమతి లేదు.

కఠినమైన వ్యాయామం

గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఏర్పడే కండరాల క్షీణతను ఎదుర్కొనేందుకు వ్యోమగాములు ప్రతిరోజూ కనీసం రెండు గంటల వ్యాయామంలో పాల్గొనాలని NASA కోరింది. ISS ట్రాంక్విలిటీ మాడ్యూల్‌లో వర్క్ అవుట్ బైక్, ట్రెడ్‌మిల్, వెయిట్-లిఫ్టింగ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. వ్యోమగాములు అక్కడ సుదీర్ఘ కాలం ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో వారి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పిస్తుంది.

లైట్, సౌండ్ ఫేస్ చేయాలి

ISS అట్మాస్పియర్ లో సౌండ్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు నిరంతరం పనిచేస్తాయి. స్టేషన్ తరచుగా సూర్యోదయాలు ఉంటాయి. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం.. వ్యోమగాములకు కంటిపై ముసుగులు, ఇయర్‌ప్లగ్‌లు అందించబడతాయి. వ్యోమగామి తల చుట్టూ CO2 ఏర్పడకుండా నిరోధించడానికి NASA స్లీపింగ్ పాడ్‌లు సరైన వెంటిలేషన్‌తో రూపొందించబడ్డాయి.

సుదీర్ఘ పనిదినాలు

ISSలో ఉన్న వ్యోమగాములు డిమాండ్‌తో కూడిన షెడ్యూల్‌ను కలిగి ఉంటారు. భోజనం విరామాలతో కలిపి రోజుకు 16 గంటల పని చేస్తారు. వారి పనిలో నార్మల్ వర్క్, శాస్త్రీయ ప్రయోగాలు, అప్పుడప్పుడు స్పేస్ వాక్ ఉంటాయి. పొడిగించిన వర్కింగ్ హవర్స్ తీవ్రమైన పనిభారానికి దారితీస్తుంది. దీనికి తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్

ఎనిమిది రోజుల్లో భూమికి చేరుకోవాల్సిన సునీతా విలియమ్స్, విల్మొర్.. ఇంకా అక్కడే గడుపుతున్నారు. ఈ పరిస్థితిలో మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇలాంటి సిచుయేషన్ ను ఆటలు, పనిలో నిమగ్నమవుతూ డీల్ చేస్తున్నారు. వర్క్ అవుట్స్ తో సహా వివిధ కార్యకలాపాల్లో బిజీగా అంటున్నారు. ఈ పనులు భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుండగా.. లేదంటే పరిస్థితి మరింత దగజారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News