కృత్రిమ ఆకులను తయారుచేసిన శాస్త్రవేత్తలు.. సూర్యకాంతిని శక్తిగా మార్చడంలో కీలకం

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ ఆకులను సృష్టించారు.

Update: 2023-07-12 08:36 GMT

దిశ, ఫీచర్స్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ ఆకులను సృష్టించారు. అయితే చెట్లపైన కాకుండా ల్యాబ్‌లో సృష్టించబడిన ఈ ఆకులు.. నిజమైన వాటి మాదిరిగానే సూర్యకాంతి, కార్బన్ డై యాక్సైడ్, నీటిని శక్తిగా మారుస్తాయని తెలిపారు. వాహనాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించడం ఈ ఆర్టిఫిషియల్ లీఫ్స్‌తో మరింత సులభతరం అవుతుందన్న సైంటిస్టులు.. బొటనవేలు పరిమాణంలో ఉండే ఆకులు.. ఇథనాల్, ప్రొపనాల్ వంటి మల్టీకార్బన్ ఇంధనాలను ఒకేసారి క్రియేట్ చేయగలవని వివరించారు. కాగా ఇటువంటి ఇంధనాలు సులభంగా నిల్వ చేయబడతాయి. అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి.

ఈ ఆకులపై 2019లో వర్క్ ప్రారంభం కాగా.. తద్వారా తయారైన సౌర ఇంధనాలు నికర సున్నా కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తి చేస్తాయి. పూర్తిగా పునరుత్పాదకమైనవి. అంతేకాదు సౌరశక్తిని ఉపయోగించి ప్రాక్టికల్ లిక్విడ్ ఫ్యూయల్‌ను ప్రొడ్యూస్ చేయగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక సాధారణంగా మొక్కజొన్న ద్వారా ఇథనాల్ ఉత్పత్తి చేయబడుతుంది. కానీ ఇదొక కాంట్రవర్షియల్ టెక్నాలజీ. ఎందుకంటే ఈ బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆహారానికి వినియోగించే మొక్కజొన్నకు బదులు ఇందుకోసం వేల ఎకరాలు వినియోగించడంతో నష్టం జరుగుతుంది. కానీ ఇకపై ఇందుకోసం ఎకరాల మొక్కజొన్న అవసరం లేదు. కృత్రిమ ఆకు ద్వారా ఇది సాధ్యమవుతుంది. చిన్న చతురస్రాకారం వలె కనిపించే ఆర్టిఫిషియల్ లీఫ్‌పై ఉన్న చతురస్రాకారపు గ్రీన్ ఫొటోనోడ్.. సన్‌లైట్‌ను కలెక్ట్ చేస్తుంది.సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఈ కృత్రిమ ఆకుల్లోని కనెక్టెడ్ సిలిండర్స్ యాక్షన్ మొదలుపెడుతాయి. 

Tags:    

Similar News