మీ పిల్లలు పెళ్ళికి "నో " చెబుతున్నారా.. తిరస్కరించడానికి ఇవే కారణాలంటూ షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళని చూడటం వల్ల కూడా యువత పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి

Update: 2024-07-04 11:25 GMT

దిశ, ఫీచర్స్: మనిషి జీవితం బాల్య దశ నుంచి మొదలయి వృద్ధాప్య దశతో ముగుస్తుంది. మధ్యలో కుటుంబం, ఉద్యోగం, పెళ్లి ఇలా మూడు బాధ్యతలు ఉంటాయి. తల్లి దండ్రులు పెంచి పెద్ద చేసి ఒక వయస్సు వచ్చాక పిల్లలకు పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే, కొందరు వివాహం గురించి ఆందోళన చెందుతారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు. పెద్దయ్యాక కూడా పెళ్లికి ఓకే చెప్పని వారు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్ కి తలెత్తే ప్రశ్న.. వారి పిల్లలు పెళ్లికి ఎందుకు నో చెబుతున్నారు? కారణాలు ఏంటి? అనే విషయాల గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. తిరస్కరించడానికి ఇవే కారణాలంటూ వీటిపై పలు పరిశోధనలు చేసి నిపుణులు షాకింగ్ నిజాలు బయట పెట్టారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

స్వేచ్ఛ

చాలా మంది యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి నో చెప్పడానికి గల మొదటి కారణం వారి స్వేచ్ఛ ఎక్కడ పోతుందనే భయం. పెళ్లి చేసుకుంటే కొన్ని ఆంక్షలు విధిస్తారని ముందుగానే భయపడుతున్నారు. ప్రస్తుతం యువత ఎంజాయ్ లైఫ్ ని గడుపుతున్నారు. అలాంటి సమయంలో పెళ్లి చేసుకుని తమ స్వేచ్ఛను పోగొట్టుకోకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ నిపుణులు చెబుతున్నారు.

లవ్ లైఫ్

పెళ్లికి ముందు వేరే వాళ్ళని ప్రేమించి బ్రేకప్ అయినా వారు కూడా పెళ్లికి అంగీకరించరు. మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళని భాద పడటం కన్నా సింగిల్ గా ఉండటం మంచిదని పెళ్లికి నో చెబుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

డివోర్స్

పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళని చూడటం వల్ల కూడా యువత పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, సినీ తారల విడాకులు, యువతపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో నిపుణులు వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది.  ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News