ఈ టాబ్లెట్‌ను అతిగా వాడుతున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి!

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి.

Update: 2024-11-23 07:15 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె మంట, దీర్ఘకాలిక మలబద్ధకం, జీర్ణకోశ వంటి సమస్యలు వస్తాయి. అయితే, వీటిలో కొన్ని సమస్యలను రోజువారి ఆహారపు అలవాట్లు, వ్యాయమం వంటి వాటి ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుంది. కానీ, ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకే పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ పెయిన్ కిల్లర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఎక్కువగా తలనొప్పి, కండరాలు, దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

అయితే, వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్ సహాయపడుతుంది. కానీ, వీటిని వైద్యుల సలహా లేకుండా ఉపయోగించడం మంచిది కాదు. పెయిన్ కిల్లర్‌ను అతిగా వాడితే, అల్సర్, అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల కిడ్నీలు, కాలేయం సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి ఇది లివర్ ఫెయిల్యూర్‌కు కారణం కావొచ్చు. అంతేకాకుండా ఇవి శరీరంలోని అవయవాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెయిన్ కిల్లర్స్ వేసుకోగానే నొప్పి తగ్గిన ఫీలింగ్ కలిగినా.. తరువాత మళ్లీ ఆ నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని అతిగా ఉపయోగించడం వల్ల తరుచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్‌ను16 ఏళ్లలోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ డాక్టర్ సలహా లేకుండా వీటిని ఇచ్చినట్లైతే పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.



Read More..

Toilet paper: టాయిలెట్‌ పేపర్‌ వాడితే క్యాన్సర్‌ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Tags:    

Similar News