ప్లాస్టిక్ బాక్సులు, ప్లేట్స్ వాడుతున్నారా.. జర జాగ్రత్త !

ఇటీవల ప్లాస్టిక్ వాడకం మరీ ఎక్కువైంది. ఒకప్పుడు అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడేవాళ్లు. కానీ.. ప్రస్తుతం అనేక రూపాల్లో ప్లాస్టిక్ మన ఇంటిని డామినేట్ చేస్తోంది. బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కుర్చీలు, టేబుల్ కవర్లు, అలంకరణ వస్తువులు, స్టిక్కర్లు ఇలా.. ప్రతీ ఒక్కటి ప్లాస్టిక్ మయంగా మారిపోతోంది.

Update: 2024-05-30 12:22 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్లాస్టిక్ వాడకం మరీ ఎక్కువైంది. ఒకప్పుడు అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడేవాళ్లు. కానీ.. ప్రస్తుతం అనేక రూపాల్లో ప్లాస్టిక్ మన ఇంటిని డామినేట్ చేస్తోంది. బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కుర్చీలు, టేబుల్ కవర్లు, అలంకరణ వస్తువులు, స్టిక్కర్లు ఇలా.. ప్రతీ ఒక్కటి ప్లాస్టిక్ మయంగా మారిపోతోంది. కానీ ఇది చాలా హానికరమని నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ పర్యావరణ వ్యవస్థపై, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతోంది.

ఈ మధ్య పలువురు ప్లాస్టిక్ టిఫిక్ బాక్సులను, ప్లేట్లను యూజ్ చేస్తున్నారు. కానీ ఇది క్యాన్సర్ కారకం. చివరికి ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచిన నీరు కూడా కలుషితమై విషపూరితం అవుతుందట. ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువుల వాడకం, వాటిలో ఆహారాలను, పానీయాలను భద్రపరిచి వినియోగించడం చాలా ప్రమాదకరం. దీనివల్ల మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులలో BPA (బిస్ఫినాల్ A) అనే ప్రాణాంతక రసాయనం ఉంటుంది.

బిస్ఫినాల్ రసాయనాలకు గురికావడంవల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై ఎఫెక్ట్ వల్ల సంతానలేమి సమస్యలు, వివిధ క్యాన్సర్లు. చర్మ రోగాలు వస్తాయి. అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు, టిఫిన్ బాక్సులు కొంతకాలం వాడి బయట పడేయడంతో అవి పర్యావరణానికి హాని చేస్తాయి. ఫుడ్ సైక్లింగ్ లేదా వివిధ కాలుష్యాల ద్వారా మళ్లీ మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ప్లాస్టిక్ వాడకూడాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాలు తీసుకెళ్లడం, నిల్వచేయడం, తినడం మరింత హానికరం. 


Similar News