మీరు వాషింగ్ మెషిన్ వాడుతున్నట్లైతే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
నేడు వాషింగ్ మెషిన్ లగ్జరీ వస్తువుగా కాకుండా ప్రతీ ఇంట్లో కనిపించే కామన్ ఐటమ్‌గా మారింది.
దిశ, ఫీచర్స్: నేడు వాషింగ్ మెషిన్ లగ్జరీ వస్తువుగా కాకుండా ప్రతీ ఇంట్లో కనిపించే కామన్ ఐటమ్‌గా మారింది. ఈ రోజుల్లో చాలామంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషన్‌లపై ఆధారపడుతున్నారు. ఇంట్లో, ఆఫీస్‌లో కష్టపడి పనిచేసే వారికి బట్టలు ఉతకడం ఒక సవాలుగా మారింది. వాషింగ్ మిషన్ వల్ల దుస్తులు ఉతకడం కొన్ని నిమిషాలలో అయిపోతుంది. దీంతో, చాలామంది వాషింగ్ మెషీన్లపై ఆధారపడుతున్నారు. దీనిని ఉపయోగించడం సులభం కాబట్టి, అది వాడేటప్పుడు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ చిన్న పొరపాట్ల కారణంగా మెషిన్ త్వరగా పాడైపోతుంది. దీనిని వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓవర్‌లోడ్: చాలామంది వారంలో ఉన్న బట్టలన్నింటినీ ఒకేసారి ఉతకడం చేస్తుంటారు. అన్నీ దుస్తులను అలా ఒకేసారి మెషిన్‌లో వేస్తే, ఓవరలోడ్ అవుతుంది. దీని వల్ల యంత్రంపై ఒత్తిడి పడుతుంది. ఈ చిన్న పొరపాటు మిషిన్‌ని పాడుచేస్తుంది. ప్రతీ మిషిన్‌కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడూ కూడా దానిని దృష్టిలో పెట్టుకుని బట్టలను అందులో వేయాలి. ఒకేసారి ఎక్కువ బట్టలు అందులో వేయడం వల్ల మెషిన్‌పై భారం ఎక్కువగా పడి, బట్టలను సరిగ్గా వాష్ చేయలేవు. దానిని గట్టిగా తిప్పాల్సి ఉంటుంది. దీని వల్ల అందులోని మోటార్ పాడైపోతుంది. ఎక్కువ బట్టలు ఉన్నట్లైతే రెండు లేదా మూడు సార్లు వేసుకోండి. ఇలా చేయడం వల్ల మెషిన్ పాడవ్వదు. ఒకవేళ వీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను ఉపయోగిస్తున్నట్లైతే.. అది త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా ఎక్కువగా బట్టలు అందులో వేస్తే డోర్ రబ్బరులో బట్టలు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది.
సమాన ఉపరితలం: మెషిన్‌ని ఎప్పుడూ కూడా సమాస ఉపరితలంపై ఉంచడం మంచిది. చాలామంది వాలుగా ఉండే ఉపరితలంపై ఉంచుతారు. అలా ఎగుడుదిగుడుగా యంత్రాన్ని ఉంచి వాడడం వల్ల దానిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కొంతమంది మెషిన్‌లో వేసిన బట్టలు ఉతకడం అయినా.. వాటిని బయటకు తీయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల మెషిన్ డ్యామెజ్ అవుతుంది. మరికొందరు ప్యాంట్లలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయకుండా వేస్తుంటారు. అలా చేయడం వల్ల చిన్న పిన్‌లు కానీ నాణాలు వంటివి మెషిన్‌లోని అంతర్గత భాగాల్లో పడి వాటిని దెబ్బతీస్తుంది. అందువల్ల బట్టలు వేసేముందు జేబులు చెక్ చేసి వేయాలి. వాస్తవానికి కొన్ని మెషిన్‌లు కొంతవరకే నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వాటిల్లో డిటర్జెంట్ ఎక్కువగా వేస్తే, నీటిలో కరగదు. యంత్రంలోనే గడ్డకడుతుంది. ప్రతీసారి ఇలా జరగడం వల్ల మోటార్ ఆగిపోతుంది. లింట్ ఫిల్టర్‌ని, నీరు వెళ్లే ఇన్‌లెట్ దగ్గర ఉండే వాటర్ ఫిల్టర్‌ని వారానికి ఒకసారైనా క్లీన్ చేయండి.