Cranberries: యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? టాబ్లెట్ కంటే ఫాస్ట్‌గా రిజల్ట్ చూపే ఈ పండు తినండి!
కొంతమంది తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు.
దిశ, ఫీచర్స్: కొంతమంది తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. సరైన సమయంలో ఫుడ్ తీసుకోకపోవడంతో అండ్ వాటర్ సరిగ్గా తాకగకపోవడం వల్ల ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు చూసినట్లైతే.. తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం,నురగ, దుర్వాసనతో కూడిన టాయిలెట్ రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా తీవ్రమైన నొప్పి రావడం, టాయిలెట్‌లో రక్తం పడడం, మూత్రాశయం నిండుగా ఉన్న ఫీలింగ్ కలగడం కానీ మూత్ర విసర్జన చేయలేకపోవడం, అసంకల్పితంగా టాయిలెట్ బయటకు పోవడం.. ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. అంతేకాకుండా పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు కూడా తరచూ మూత్ర వ్యాధులతో బాధపడుతారు. అయితే నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్ లకు యాంటీ బయాటిక్స్ ఉపయోగించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా తగ్గాలో వైద్యులు పలు సూచనలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణ...
ఈ ప్రాబ్లమ్‌ను తగ్గించడానికి క్రాన్‌బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి ఆన్‌లైన్‌లోనూ, డ్రైఫ్రూట్ షాప్‌లోనూ ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో విటమిన్ సి, ఇ, ఎ, కె, బి 5, బి6, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియ, ఆనుము, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు క్రాన్‌బెర్రీస్ తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. టాయిలెట్ వెళ్లిన సమయంలో మూత్రాన్ని పూర్తిగా విసర్జించే ప్రయత్నం చేయాలి. టాయిలెట్ కు వెళ్లిన ప్రతి సారి లైంగిక అవయవాలను పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
ఈ క్రాన్‌బెర్రీస్ కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్లకే మాత్రమే కాకుండా అజీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. మూత్రనాళంలో హానికరమైన క్రిముల నుంచి కాపాడుతాయి. మన బాడీలోకి వైరస్‌లు చొచ్చుకుపోకుండా రక్షిస్తాయి. క్రాన్‌బెర్రీ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
గమనిక:గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.