ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉక్కపోత, వేడి, ఇమ్యూనిటీ తగ్గడం, విపరీతమైన అలసట వలన రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడు. ముఖ్యంగా ఒంట్లో అతి వేడితో బాధపడే
దిశ, వెబ్డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉక్కపోత, వేడి, ఇమ్యూనిటీ తగ్గడం, విపరీతమైన అలసట వలన రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడు. ముఖ్యంగా ఒంట్లో అతి వేడితో బాధపడే వారు రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే అలాంటి వారు రాత్రి పూట ఇలాంటి డ్రింక్ తీసుకుంటే, ఒంట్లో వేడి తగ్గి కంటినిండా నిద్రపడుతుందంట. ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి నిద్ర పోయేముందు గుల్కన్డ్ మిల్క్ తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది మంచి నిద్ర పడుతుందంట. వేసవి లో ఎండ ఎక్కువ ఉంటుంది కనుక ఆ వేడిని తట్టుకోవడానికి చెరుకు రసం కూడా తీసుకోవచ్చు చెరుకు రసాన్ని కూడా తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది పైగా తక్షణ ఎనర్జీని పొందొచ్చు.
Also Read..