Rejection: రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా..? అప్పుడేం చేయాలంటే..!
జీవితంలో ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో రిజెక్ట్ అవుతుంటారు.
దిశ, ఫీచర్స్: జీవితంలో ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో రిజెక్ట్ అవుతుంటారు. మంచి జరుగుతుందని ఊహించినా.. వీరు ప్రతి పనిలో తిరస్కరణకు గురవుతారు. ఇలాంటి సందర్భంలో వారు చాలా బాధకు లోనై, డిప్రెక్షన్‌కి గురయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇది భవిష్యత్ మీద ఆశలను కోల్పోయేలా చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసినా.. జాబ్ విషయంలో రిజెక్ట్ అయినా.. ఇలా చాలా సందర్భాల్లో తిరస్కారం ఎదురవుతుంది. దీని వల్ల ఏదీ సాధించలేరనే భావన కలుగుతుంది. రిజెక్ట్ చేయడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఏ విషయంలోనైనా రిజెక్ట్ అవ్వడానికి చాలా అంశాలు కనిపిస్తుంటాయి. తగిన అర్హత లేకపోవడం, కోపంతో తిరస్కరించడం, నచ్చకపోవడం కావొచ్చు. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా బాధపడుకుండా ఈ తిరస్కారాన్ని అంగీకరించాలి. దీనిని మనలో ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేసుకునే అవకాశంగా భావించాలి. ఇది కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే. దీనికి తమని తాము నిందించుకోవడం, ఇతరులు కారణమని వాళ్లని తిట్టుకోవడం వంటివి చేయకూడదు. సరిగా ఆలోచిస్తే తిరస్కరణ వల్ల కొత్త అనుభవాలను నేర్చుకోవచ్చు. దీనిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగాలి.
జీవితంలో విజయం సాధించాలంటే ఇలాంటి తిరస్కరణలకు క్రుంగిపోకూడదు. ఏది జరిగినా మంచికే అనుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటే ఉన్నత స్థానానికి చేరుకోలేరు. దీని వల్ల అవకాశాలు కోల్పోతారు. తిరస్కరణ ఎదురైనప్పుడు బాధపపడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రిజెక్ట్‌ని యాక్సప్ట్ చేసి, భవిష్యత్‌పై దృష్టి పెడితే విజయం సాధిస్తారు. సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యమైనది. రిజెక్ట్ చేయడం అనేది కేవలం జీవితంలో ఒక చేదు అనుభవంగా భావించి, భవిష్యత్‌పై దృష్టి పెట్టాలి.