Health: మానసికంగా అలసిపోయారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒకప్పుడు మానసిక అలసట పెద్దల్లోనే కనిపించేది.

Update: 2023-03-12 06:00 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మానసిక అలసట పెద్దల్లోనే కనిపించేది. కానీ ప్రస్తుతం అందరిలోనూ కనిపిస్తోంది.బిజీ లైఫ్ స్టైల్, పెరుగుతున్న పోటీ వాతావరణం ఇందుకు కారణం అవుతున్నాయని మానసి నిపుణులు చెప్తున్నారు. శారీరకంగా అలసిపోయినప్పుడు ఆ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అలసిపోయినప్పుడు ఆ ప్రభావం మనస్సుపై పడుతుందట. స్థాయికి మించి ఆలోచనలతో కూడిన పని చేసినప్పుడు, వృత్తిపరమైన సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఆందోళనలు, దీర్ఘకాలిక ఆలోచనలు, ఓవర్ థింకింగ్ వంటివి మనసు అలసిపోవడానికి దారితీస్తాయి.

లక్షణాలు-నివారణ

ఎప్పుడూ బాధగా, నిరాశగా ఉండటం,ఆందోళనగా ఉండటం, ఏ విషయంలోనూ పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడం, ఒంటరిగా ఉండేందుకు మొగ్గుచూపడం, ప్రతీ చిన్న విషయానికి చిరాకు, అతిగా స్పందించడం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి మానసిక అలసటలో కనిపించే లక్షణాలు. చేసే పనిలో బ్యాలెన్స్ పాటించడం, ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండటం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం, ఇష్టమైన పుస్తకం చదవడం, ప్రకృతిని ఆస్వాదించడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి మానసిక అలసటను దూరం చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఉత్సాహం కలిగించే పనులు చేయాలి.అప్పటికీ మీలో సమస్య ప్రభావం ఏమాత్రం తగ్గకపోయినా, దీర్ఘకాలంపాటు మానసిక అలసటను ఎదుర్కొంటున్నా సైకియాట్రిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : పక్షులను పెంచుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే? 

Tags:    

Similar News