Health: తినే సమయంలో మొబైల్ చూస్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే అంటున్న నిపుణులు

ఎందుకంటే, రోజు రోజుకు ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం పెరిగిపోతుంది.

Update: 2025-03-23 07:38 GMT
Health: తినే సమయంలో మొబైల్ చూస్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే అంటున్న నిపుణులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు ఫోన్స్ వాడని ఊర్లని, ఇల్లుల్ని చూశాము. కానీ, ఇప్పుడు అలాంటి ఇల్లు ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే, రోజు రోజుకు ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం పెరిగిపోతుంది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. కొందరైతే, మరి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లలో వీడియోలు చూసుకుంటూ నడుపుతున్నారు. దీని వలన ఎంత నష్టం జరుగుతుందా అని మాత్రం అస్సలు ఆలోచించడం లేదు. ఆ కాసేపు సరదా కోసం .. ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఇంకొందరు గంటల తరబడి ఫోన్లను వాడుతూ సమయం వృథా చేస్తున్నారు. ఆ సమయంలో వారు ఫుడ్ ప్లేట్ పెట్టుకుని చూస్తూ ఉంటారు. వారి దృష్టి మొత్తం .. ఫోన్ పైనే ఉంటుంది. ఫుడ్ అయిపోయిన కూడా ఏం పట్టించుకోకుండా తినేస్తుంటారు.

అయితే, ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ చూస్తూ తినే వారికి అనేక సమస్యలు వస్తాయి. భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే.. మీరు తిన్న ఫుడ్ జీర్ణమవుతుంది. అలాగే, అరుగుదల ఉంటుంది. తినే సమయంలో .. దృష్టి అంతా ఫోన్ పై ఉండే .. ఏం తింటున్నారు? ఎంత తిన్నారో కూడా అర్ధం కాదు. ఆ తర్వాత, ఊబకాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News