‘మనీ ప్లాంట్’ను ఇంట్లో పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మొక్క నాటడం వల్ల నెగిటివిటీ దూరమవుతుందని నమ్ముతుంటారు. పాజిటివ్ శక్తి ప్రసరిస్తుందనీ నమ్ముతుంటారు. వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్క విషయంలో కొన్ని సూచనలున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే మనీ ప్లాంట్‌ను నాటాలట. మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలోనే అమర్చాలి. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎప్పుడూ అమర్చకూడదు. ప్లాస్టిక్ మెటీరియల్‌లో పెంచకూడదు. పచ్చరంగు గాజు లేదా మట్టి పాత్రలో పెంచాలి. వాస్తు ప్రకారం అప్పుల నుంచి బయటపడేందుకు చాలామంది తమ ఇంట్లో మనీ ప్లాంట్లను పెంచుతుంటారు.
దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ. మనీ ప్లాంట్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాటి నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది. సరైన ప్లేస్‌లో దీనిని పెంచితే సంపదలను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతుంటారు. ఇది వేగంగా పెరిగే మొక్క. ఫలితంగా మొక్క తీగలు భారీగా పెరుగుతాయి. అయితే తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు ప్రకారం.. పెరుగుతున్న తీగలు శుభసూచకం. మనీ ప్లాంట్లు లక్ష్మీ దేవి అభివ్యక్తి అని చెబుతారు. అందుకే వాటిని నేలను తాకకుండా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి: