పెళ్లికి సిద్ధమవుతున్నారా.. అయితే, వారం రోజుల ముందు నుంచి వీటిని దూరం పెట్టండి!

పెళ్లి కుదిరిన తర్వాత , పెళ్లి పీటలపై అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు.

Update: 2024-02-24 12:39 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లి కుదిరిన తర్వాత , పెళ్లి పీటలపై అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే, మీరు మీ ఆహారంలో జాగ్రత్తగా ఉండకపోతే, మీరు మీ ముఖానికే కాకుండా మీ శరీరానికి కూడా హాని కలుగుతుంది. అందుకే పెళ్లికి ఒక వారం ముందు నుంచి కొన్ని ఆహారపదార్థాలు తినకూడదని నిపుణులు అంటున్నారు. అందుకే పెళ్లికి ముందు ఏం తినాలో, ఏం తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

మసాలా ఆహారాలు

స్పైసీ ఫుడ్స్ రుచికరంగా ఉంటాయి. కానీ అవి శరీరానికి అంతగా ఉపయోగకరం కావు. వివాహ సమయంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో మంట, కడుపు నొప్పి వస్తుంది.

కాఫీ

పెళ్లి సమీపిస్తున్న కొద్దీ వివిధ వివాహ వేడుకల్లో టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. కానీ వీటిని తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీలు తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పెరుగుతుంది. దీంతో పాటు కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే పెళ్లికి వారం రోజుల ముందు కాఫీని దూరం పెట్టమని చెబుతున్నారు.

పాలు

పాలు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. ఇదిలా ఉండగా పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కావున వివాహానికి 10 రోజుల ముందు పాలను దూరం పెట్టడం మంచిది.

బీన్స్

బీన్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నప్పుడు వీటిని తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే బీన్స్ తింటే ప్రొటీన్ లభిస్తుంది. కానీ జీర్ణించుకోవడం కష్టం అవుతుంది.



Read More..

సక్సెస్‌ వైపు నడిపించే మార్నింగ్ హాబిట్స్.. పాటిస్తే అద్భుతాలే..  


Similar News