వాలెంటైన్స్ వీక్‌లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా?.. ఇలా చేయండి.. 

Update: 2022-02-10 09:01 GMT

దిశ, ఫీచర్స్ : కొత్తగా బ్రేకప్ అయిన చాలా మంది వాలెంటైన్స్ వీక్‌లో బాధపడుతూనే ఉంటారు. పార్ట్‌నర్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని కుమిలిపోతుంటారు. కానీ అంతా మన మంచికేలే అని.. ఆ బాధ నుంచి బయటపడటం మంచిదని అంటున్నారు నిపుణులు. అందుకే ఆ ఒంటరితనం నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని టిప్స్ సజెస్ట్ చేస్తున్నారు.

మ్యూజిక్ బూస్ట్ :

మ్యూజిక్ పవర్‌‌ను అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు ఇంట్లో పాజిటివ్ మ్యూజిక్ ప్లే చేసి చూడండి. మైండ్‌కు బూస్ట్‌ను ఇస్తూ.. మోటివేట్ చేస్తుంది. ఫీల్ గుడ్ అందించడంలో బెస్ట్‌గా వర్క్ చేస్తుంది. క్లాసిక్ సాంగ్స్, పూరీ జగన్నాధ్ లాంటి పోడ్‌కాస్ట్‌లు, ఎంటర్‌టైనింగ్ ఇంటర్వ్యూస్(ఆడియో) పెట్టుకుని వినండి. మీకు తెలియకుండానే హ్యాపీగా ఉంటారు.


సింగిల్స్ పార్టీ :

వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులే పార్టీ చేసుకోవాలని రూల్ ఏముంది? సింగిల్స్ పార్టీ ఎందుకు ప్లాన్ చేయకూడదు? అంటున్నారు నిపుణులు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మీ చుట్టుపక్కల ఉన్న సింగిల్స్, ఫ్రెండ్స్‌తో కలిసి చక్కగా ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. పార్టీ ఫన్నీ అండ్ ఫంకీ థీమ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవడం.. నైస్ కాక్‌టెయిల్స్, స్నాక్స్ ఏర్పాటు చేసుకోవడం.. మంచి డ్రెసింగ్‌తో సూపర్బ్‌గా రెడీ కావడం .. లాంటివి మైండ్‌ను సాడ్ మూమెంట్స్‌ను బయటకు తీసుకొచ్చి హ్యాపీగా ఉండేలా చేస్తాయని చెప్తున్నారు.


షాపింగ్:

కొన్నిసార్లు రిటెయిల్ థెరపీ కూడా మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. మాల్స్, ఓపెన్ ప్లేసెస్ మీకు నచ్చిన చోట షాపింగ్ చేయండి. ఇంతకు ముందు ఎక్స్‌పెన్సివ్ అనుకున్నా.. కొనగలిగే సామర్థ్యం ఉన్న వస్తువులను కొని చూడండి. అందులో వచ్చే శాటిస్‌ఫాక్షన్ మంచి కిక్ ఇస్తుంది. ఈ టైమ్‌లో అది అవసరమని చెప్తున్నారు.


క్రియేటివ్ సైడ్:

మీరు వంట చేయగలరా? డ్రాయింగ్‌ను ఇష్టపడతారా? మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఆలస్యం లేకుండా చేసేయండి. మీ సృజనాత్మకతను బయటకు తీయడం ద్వారా వచ్చే సంతృప్తి ఎలాంటి బాధనైనా దూరం చేయగలదు. మ్యూజిక్ నేర్చుకోవాలని అనిపిస్తే యూట్యూబ్‌లో చూసి ట్రై చేయండి.


బుక్ వరల్డ్ :

మంచి నవల, అమేజింగ్ బుక్స్, రొమాంటిక్ స్టోరీస్ చదవడం వల్ల మంచి ఫీల్ కలగొచ్చు. ఆ ప్రపంచంలో విహరించవచ్చు. మీ గురించి మీరు తెలుకోవాల్సిన విషయాలు ఇందులో ఉండొచ్చు లేదా కొత్త విషయాలను గ్రహించవచ్చు.  లైట్ రీడ్ లేదా హెవీ నరేషన్..మీరు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారో చూసి ఎంచుకోండి. వాలంటైన్ వీక్‌ని ఎంజాయ్ చేయండి.



Tags:    

Similar News