పచ్చి ఉల్లిపాయను బిర్యానీతో పాటు తింటున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!

ప్రస్తుతం చిన్నా పెద్ద అంతా బిర్యానిని రోజూ తినమన్నా ఎంతో ఇష్టంగా తింటుంటారు.

Update: 2023-08-14 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిన్నా పెద్ద అంతా బిర్యానిని రోజూ తినమన్నా ఎంతో ఇష్టంగా తింటుంటారు. బిర్యానీ తో పాటు పచ్చి ఉల్లిపాయను పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. రెస్టారెంట్స్‌లో పెరుగు ఇవ్వకపోయినా ఏం కాదు కానీ, ఉల్లి ముక్కలు ఇవ్వకుంటే మాత్రం నానా చేసేస్తారు. జనాలు అంతలా బిర్యానీలో ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకున్నారు. కొంత మంది బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయను పెట్టుకొని తింటుంటే స్వర్గాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతుంటారు. అయితే అలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏదైనా మితంగా తింటే ఏం కాదు కానీ, అధికంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

* పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. కాబట్టి ఇది ప్రేగులపై ప్రభావం చూపిస్తుంది.

* అలాగే పచ్చి ఉల్లిని ఎక్కువగా తీసుకుంటే కడుపులో నొప్పి కలుగుతుంది.

* దీని వల్ల నోటి దుర్వాసన తో పాటుగా ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది.

* ముఖ్యంగా గర్భిణులు పచ్చి ఉల్లిని తింటే వాంతులు, గుండెలో మంట, వచ్చే అవకాశం ఉంది.

* ఇందులో ఉండే పొటాషియం లివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

* కొంత మందిలో మలబద్ధకం కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి.

Read More:   రూ. 2 వేల కోట్ల ఆస్తి వద్దనుకుని ప్రేమికుడిని పెళ్లాడిన.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Tags:    

Similar News