టేస్టీగా ఉంటాయని పిజ్జాలు, బర్గర్లు తింటున్నారా?.. తర్వాత జరిగేది ఇదే..

టేస్టీగా ఉంటాయని పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటి జంక్‌ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీరు రిస్క్‌లో పడ్డట్లే అంటున్నారు పోషకాహార నిపుణులు.

Update: 2024-07-05 14:05 GMT

దిశ, ఫీచర్స్ : టేస్టీగా ఉంటాయని పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటి జంక్‌ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీరు రిస్క్‌లో పడ్డట్లే అంటున్నారు పోషకాహార నిపుణులు. నోటికి రుచిగా అనిపించేవన్నీ ఆరోగ్యానికి మంచివి కావని హెచ్చరిస్తున్నారు. పైగా వాటిలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలు, కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తయని చెప్తున్నారు.

కొలంబియా యూనివర్సిటీకి చెందిన పోషకాహార నిపుణుల ప్రకారం.. పిజ్జాలు, బర్గర్లు వంటివి తరచుగా తినే అలవాటు ఉన్న అమ్మాయిల్లో చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం ఇటీవల పెరిగిపోతోంది. మరి కొందరిలో ఒబేసిటీ సమస్య తలెత్తి తలెత్తతోంది. జంక్ ఫుడ్స్ అలవాటువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా తరచుగా పిజ్జాలు, బర్గర్లు తినే పిల్లలు, పెద్దలు కూడా అధిక బరువు, మిడిల్ ఏజ్ కంటే ముందే గుండె జబ్బులు వంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నట్లు పోషకాహార నిపుణులు చెప్తున్నారు. జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

*నోట్: పైవార్త ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యావసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News