Rainy season: వేడివేడిగా సమోసా, మిర్చీ బజ్జీ తింటున్నారా.. హెచ్చరిస్తున్న నిపుణులు!
వర్షాకాలంలో వెదర్ కూల్‌గా ఉండటంతో పాటుగా కాస్త చలిగా కూడా అనిపిస్తుంటుంది.
దిశ, ఫీచర్స్: వర్షాకాలంలో వెదర్ కూల్‌గా ఉండటంతో పాటుగా కాస్త చలిగా కూడా అనిపిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లటి వాతావరణంలో వేడి వేడి సమోసాలు, బజ్జీలు, పానీ పూరి ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తారు. సాయంత్రం కాగానే ఏదో స్నాక్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే జాగ్రత్తలు పాటించకుండా ఏది పడితే అది తినేస్తూ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటారు. కానీ వర్షాకాలం ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జలుబు, దగ్గు, మలేరియా, జ్వరం, డెంగ్యూ, ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, న్యుమోనియా వంటివి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇవన్నీ ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తుతాయి. కాబట్టి ఫుడ్ తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం మంచి నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వాతావరణంలో జరిగే మార్పులు శరీరంపై ప్రభావం చూపుతాయి. భారీ వర్షాల కారణంగా.. రోగనిరోధక శక్తి బలహీనపడి పలు రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. అయితే వీటికి దూరంగా ఉండటం వల్ల సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వర్షం పడిందంటే సమోసా, మిర్చీ బజ్జీ, పానీ పూరి, ఫ్రైడ్ రైస్, మంచూరియా వంటివి తినాలని అనిపిస్తుంటుంది. కానీ వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. విరేచనాలతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కాబట్టి తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆకుకూరల్లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరి సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో సీ ఫుడ్‌ను జనాలు అతిగా తింటుంటారు.
చేపలతో వెరైటీస్ చేసుకుని కూల్ వెదర్‌లో లాగించేస్తుంటారు. అలాగే మందులో స్టఫ్‌గా కూడా వేయించిన చేపలు తింటుంటారు. కానీ వర్షాకాలం తినడం వల్ల కలుషితమైన నీటిలోని చేపలు తినడంతో అనారోగ్యానికి గురవుతారు. ఇక వర్షాకాలం చికెన్, మటన్ కంటే పుట్ట గొడుగులను ఎక్కువగా తింటుంటారు. కానీ అవి తేమ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి తినకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక కొందరికి కూరగాయలు పచ్చిగా తినే అలవాటు ఉండటం వల్ల వర్షాకాలం కూడా వారు అలాగే తింటుంటారు. కానీ ఈ సీజన్‌లో ఉడికించకుండా తినడం వల్ల సమస్యలలు వస్తాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. దీనిని దిశ ధృవీకరించడం లేదు.