ఎండలకు చిల్ అవుదామని మద్యం తాగుతున్నారా.. డేంజర్ అంటున్న నిపుణులు!
చూస్తుండగానే సమ్మర్ వచ్చేసింది. మార్చి చివరి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.
దిశ, ఫీచర్స్: చూస్తుండగానే సమ్మర్ వచ్చేసింది. మార్చి చివరి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఏప్రిల్ మొదలు కాగానే ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదవుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 4.3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే రికార్డ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో వచ్చే నెల ఎండల తీవ్రత ఎంతగా పెరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. దీంతో సమ్మర్‌లో ఎండలను తట్టుకునేందుకు డైట్ ఫాలో అవుతూ శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
చల్లటి పానీయాలు, చలువ చేసే ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే కొందరు సమ్మర్ వచ్చిందంటే చాలు చిల్ అవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో చల్ల చల్లగా ఉండే మద్యాన్ని సేవిస్తూ ఎండ తాపాన్ని తీర్చుకుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలోనే మద్యం దుకాణాలకు అధికంగా లాభం వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక రెండు రోజులకు ఒకసారి అయినా మద్యాన్ని సేవిస్తుంటారు. అయితే వేసవిలో మద్యాన్ని సేవించడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. మద్యం తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
* మందు తాగడం వల్ల శరీరంలోని వేడి ఎక్కువ అయి.. చెమటగా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే బాడీలో నీటి శాతం తగ్గి వడదెబ్బ తగలడంతో పాటుగా డీహ్రైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
* వేసవిలో మద్యం సేవించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ పెరుగుతాయి. అలాగే వాంతులు, విరేచనాలు, తలనొప్పి మూర్ఛ వంటివి వచ్చి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
* సమ్మర్ చాలా మంది ఫ్యామిలీ, ఫ్రెండ్, కొలిగ్స్‌తో వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అంతా సరదాగా మద్యం సేవించి సముద్రం, సరస్సులు, బీచ్ వంటి వాటి దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మత్తులో ఉంటారు కాబట్టి స్విమ్మింగ్ చేయలేరు. దీంతో తెలియకుండానే మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో మద్యం తాగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి.
* అలాగే మద్యం తాగిన తర్వాత కొందరు దూర ప్రయాణాలు చేస్తుంటారు. మద్యం మత్తు శరీరానికి ఎక్కడం వల్ల నిద్ర వచ్చినట్లు అయి కారు నడపలేక ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమయంలోనే ఎక్కువ కారు ప్రమాదాలు అవుతాయి. ఇప్పటికే ఎంతో మంది డ్రింక్ చేసిన తర్వాత బండి నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి సమ్మర్‌లో మద్యానికి కాస్త దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.