పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్న నిపుణులు
ప్రతి ఏడాది లక్షల మంది ప్రజలు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రతి ఏడాది లక్షల మంది ప్రజలు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఈ వ్యాధి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధికి మూలకారణం జన్యుపరమైన కారణం కావచ్చునని నిపుణులు పరిశోధనలు చేసి చెబుతున్నారు. సరైన ఆహారం, జీవనశైలిలో మార్పులు కారణంగా చిన్న వయస్సులోనే క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. అన్ని వయసుల వారికి క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఇప్పుడు పిల్లలలో ఎముక క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
పిల్లల్లో బోన్ క్యాన్సర్ చాలా త్వరగా పెరుగుతోంది. అధిక స్థాయి రేడియేషన్ త్వరగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లల కుటుంబంలో ఎవరైనా మద్యం సేవిస్తే.. పిల్లలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ప్రస్తుతం చిన్నారుల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. పెద్దలతో పోలిస్తే, పిల్లలు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్దవారిలో క్యాన్సర్ అనేది జీవనశైలి, ధూమపానం, మద్యపానం వంటి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఒత్తిడి కానీ, పిల్లలలో మద్యం లేదా పొగ కూడా త్రాగరు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. పిల్లలు పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తింటే క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.