కళ్లార్పడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? అవేంటో తెలిస్తే షాక్..

మనం సాధారణంగా రోజుకి కొన్ని వేల సార్లు కళ్లా్ర్పుతు ఉంటాము. అది మనకు సహజంగా జరుగుతుంది

Update: 2024-04-15 05:20 GMT

దిశ,ఫీచర్స్:మనం సాధారణంగా రోజుకి కొన్ని వేల సార్లు కళ్లా్ర్పుతు ఉంటాము. అది మనకు సహజంగా జరుగుతుంది.ఏదో మనకు ఆలోచనలకి గురి చేసే విషయం అయిన,బాగా నచ్చిన విషయం అయిన ఉంటేనే తదేకంగా చూస్తే తప్ప కనురెప్పలు కొట్టకుండ ఉండలేము. అలా కాకుండా ఒకవేళ మీరు బలవంతంగా కను రెప్పలు మూయకుండా ఉంటే వెంటనే కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఇలా మనం కన్నార్పిన ప్రతిసారీ మన కనుగుడ్ల లో తడి చేరుతుంది.అయితే..ఇలా కన్నార్పడం వల్ల మన దృష్టి కూడా మెరుగవుతుంది అని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది ఓ అధ్యయనం. ఇలా చేయడం వల్ల రెటినాల్ స్టిమ్యులేషన్(retinal stimulation )పెరుగుతుందని తేలింది. నిజానికి సైట్ ఉన్నవాళ్లు ఓ తెల్లని గోడ వైపు చూస్తూ 5 సెకన్ల కోసారి కన్నార్పుతూ కాసేపు చేస్తే కొంత వరకూ ఆ సమస్య పోతుంది అని వైద్యులు చెబుతున్నారు. బ్లింకింగ్ కు ఉన్న పవర్ అలాంటిది. అంతే కాదు. ఇలా కళ్లార్పడం వల్ల అటెన్షన్ పెరుగుతుందట. ఓ వస్తువు ని గుర్తించగలిగే శక్తీ పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

మనం ఇలా కళ్లార్పినప్పుడు 300 మిల్లీ సెకన్ల పాటు చూపు కోల్పోతాం. ఆ కాసేపు విజువల్ ఇన్పుట్స్ కి మన కళ్ళలోని న్యూరాన్స్ స్పందించకుండా ఉండిపోతాయి. అయితే...ఇలా కళ్ళు మూసి తెరిచిన ప్రతిసారీ విజిబిలిటీ అంతకు ముందు కన్నా చాలా చురుగ్గా మారుతుంది అని 2016లో ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ స్టడీ లో భాగంగా 12 మందికి రకరకాల ఇమేజెస్ చూపించారు. రెండు కళ్లు ఆర్పినప్పటికీ ఓ కన్ను పై మాత్రమే పరిశోధన చేశారు. అలా బ్లింక్ చేసి కళ్ళు తెరిచే క్రమంలో వాళ్లకు ఎదురుగా ఉన్న వస్తువులు మరింత క్లియర్ గా కనిపించాయి అని చెప్పారు. రెటీనాపై పడే కాంతి తీవ్రత పెరిగిందని గుర్తించారు. రోజులో కనీసం 10 గంటలు పని చేస్తామనుకుంటే...ఆ సమయంలో దాదాపు 10% సమయం ఇలా కళ్లార్పుతూ గడుపుతామట.

చాలా మందిలో కంటి చూపు తగ్గిపోతుంది దాని కోసం ఆకుకూరలు, గుడ్డుసొన, బంగాళా దుంప, గుమ్మడికాయ, క్యారెట్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా దృష్టి లోపాన్ని తగ్గించుకోవచ్చు. చేపలు ఎక్కువగా తీసుకుంటే కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే కొన్ని ఎక్సర్సైజ్లు ద్వారా కొంత వరకు ఐ సైట్ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. అందులో కళ్ళు తిప్పడం (Eye rolling )ఒకటి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వాళ్ళు క్లాక్వైజ్ లో కాసేపు, యాంటీ క్లాక్ వైజ్ లో కాసేపు కళ్లను గుండ్రంగా తిప్పాలి. మధ్యలో కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఇలా దాదాపు 5 సార్లు చేయడం ద్వారా కళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. ల్యాప్టాప్ ముందు అదేపనిగా కూర్చున్నప్పుడు 20-20 రూల్స్ ఫాలో అవ్వాలి అని చెబుతున్నారు వైద్యులు. అంటే ప్రతి 20 నిమిషాలకోసారి ల్యాప్టాప్ని పక్కన పెట్టి ఏదైనా ఓ వస్తువు ని 20 అడుగుల దూరం నుంచి 20 సెకన్ల పాటు తదేకంగా చూడాలి.


Similar News