రాళ్లా.. రాక్షస బల్లుల గుడ్లా..? మధ్యప్రదేశ్‌లో అంతుచిక్కని వస్తువులు!

Update: 2022-02-10 13:42 GMT

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెండ్వా జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తలు రాయి ఆకారంలో ఉన్న పది భారీ వస్తువులను కనుగొన్నారు. ఇవి క్రెటేషియస్ కాలం(45-66 మిలియన్ సంవత్సరాల) నాటి డైనోసార్ గుడ్లని కొందరు విశ్వసిస్తుండగా.. అవి నిజంగా శిలాజ గుడ్లేనా..? కాదా..? శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. అయితే ఏవైనా శిలలు ఇటువంటి ఆకారాన్ని సంతరించుకునేందుకు మిలియన్ సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతం బయటపడ్డ వస్తువులు పాత బసాల్టిక్ శిలలు కావచ్చని వారు పేర్కొన్నారు.

పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారుల బృందం చేపట్టిన గ్రౌండ్ సర్వేలో భాగంగా అడవిలో ఈ వస్తువులను కనుగొన్నారు. వీటిలో భారీ సైజున్న శిల దాదాపు 40 కిలోల బరువు ఉంటుందని, మిగతావి 25 కిలోలు ఉంటాయని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ భారతీయ మీడియాతో తెలిపాడు. ఇందులో మూడింటిని ఇండోర్‌ మ్యూజియంలో ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు.

కాగా ఈ వస్తువులు 67-64 ఏళ్ల నాటివిగా తెలుస్తోందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధనంజయ్ తెలిపారు. ఇందులో కొన్ని బసాల్టిక్ శిలల గోళాకార వాతావరణంలో కనిపిస్తున్నట్లు చెప్పాడు. ఇక 2007లోనూ ధార్‌లో సౌరోపాడ్ డైనోసార్లకు చెందిన 25 గూళ్లలో పెద్ద సంఖ్యలో శిలాజ గుడ్లు కనుగొన్నారు. వీటన్నింటి కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

Tags:    

Similar News