ఏప్రిల్ 2.. ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే
‘అక్షర రూపం దాల్చిన సిరా చుక్కా లక్ష మెదళ్ల కదలిక’ అని పెద్దలు చెబుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్: ‘అక్షర రూపం దాల్చిన సిరా చుక్కా లక్ష మెదళ్ల కదలిక’ అని పెద్దలు చెబుతుంటారు. అక్షరానికి ఉన్న పవర్ అది. మరి అలాంటి అక్షరాలను తనలో పొందుపరుచుకున్న పుస్తకానికి ఇంకెంత పవర్ ఉండాలి? ఇక ఆ పుస్తకాన్ని తన మస్తిష్కంలోకి ఎక్కించుకునే వ్యక్తి ఇంకెంత పవర్ ఫుల్ అయి ఉండాలి? కాబట్టే ప్రపంచంలో పుస్తక పఠనానికి చాలా విలువ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొందరు విద్యావేత్తలు చిన్నప్పటి నుంచే పిల్లల్లో పఠనాసక్తిని కలిగించేందుకు కృషి చేశారు. వాళ్లను ఆకట్టుకునేందుకు వాళ్ల కోసమే ప్రత్యేకంగా బుక్స్ రాశారు. అలా పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాసిన డెన్మార్క్ కు చెందిన హాన్స్ క్రిస్టియన్ అండర్సన్. ఆయన బర్త్ డే అయిన ఏప్రిల్ 2వ తేదీన ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే జరుపుతారు. 1967 నుంచి ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు.
ఇక ఈ ‘డే’ను ఎలా నిర్వహిస్తారంటే..?
ఇక ప్రతి ఏడాదిఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డేను ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 1967 నుంచి ఈ డేను నిర్వహిస్తున్నారు. కాగా 2002లో ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ డే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనేక పోస్టర్లు ప్రింట్ చేయించారు. ఒక్కో ఏడాది ఒక్కో దేశం ఈ ఈవెంట్ కు స్పాన్సర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ డేన నిర్వహంచే దేశం ఆ ఏడాదికి సంబంధించిన థీమ్ ను ఎంపిక చేస్తుంది. థీమ్ తగ్గ పోస్టర్ ను రూపొందించేందుకు తమ దేశం నుంచే ఓ డిజైనర్ ను ఆహ్వానిస్తుంది. అలాగే తమ దేశం నుంచి ప్రముఖ రచయితను ఎంపిక చేసి ప్రపంచ దేశాల పిల్లలకు సందేశాన్ని పంపాలని కోరుతుంది. ఈ క్రమంలోనే పిల్లల్లో సాహిత్య అభిరుచిని, పఠనాసక్తిని పెంపొందించేందుకు స్కూళ్లు, లైబ్రరీల్లో రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విజేతలుగా నిలిచిన పిల్లలకు అవార్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. కాగా 2023 ఏడాదికి గానూ ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డేను గ్రీస్ స్పాన్సర్ చేస్తోంది.
బాలలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు
చిన్న పిల్లల్లో పఠనాసక్తి, మానవతా విలువలు, విజానాన్ని పెంచేందుకు తెలుగులో కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. విష్ణుశర్మ రాసిన ‘పంచతంత్ర కథలు’ పుస్తకాన్ని పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. జంతువులు, పక్షలు తదితర జీవాలు ఈ కథల్లో ముఖ్య పాత్రలుగా ఉంటాయి. ఇక చందమామ కథలు, బాలమిత్ర కథలు కూడా చాలా ఫేమస్. అలాగే పేదరాసి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, అలీబాబా 40 దొంగలు, రిప్ వాన్ వింకిల్ కథలు, తాతాయ్య చెప్పిన కథలు, రాజుల కథలు, మర్యాద రామన్న కథలు, గలీవర్ సాహస యాత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్-బీర్బల్ వంటి ఎన్నో పుస్తకాలు పిల్లలకు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు నాలెడ్జ్ ను ఇస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: