మీకు ఇది తెలుసా.. ఏం చేయకుండా ఉండడం కూడా ఓ ఆర్ట్ అంట!
కొంత మంది ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటారు. కనీసం వారు ఇంట్లో పని కూడా సరిగా చేయరు. అయితే మన పెద్దవారు తిడుతుంటారు. ఎందుకున్నావు అసలు ఏ పని చేయకుండా అని, కానీ ఎలాంటి పని చేయకుండా
దిశ, ఫీచర్స్ : కొంత మంది ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటారు. కనీసం వారు ఇంట్లో పని కూడా సరిగా చేయరు. అయితే మన పెద్దవారు తిడుతుంటారు. ఎందుకున్నావు అసలు ఏ పని చేయకుండా అని, కానీ ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉండటం కూడా ఓ ఆర్ట్ అంట. ఏమీ చేయకుండా ఉండటం వలన బోలెడంత మంచి జరుగుతుందంటున్నారు డచ్ వారు. కాగా, అసలు ఖాళీగా ఉండటం వలన కలిగే లాభాలు ఏంటీ అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఎలాంటి పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. సింపుల్‌గా చెప్పాలంటే, మన ఇంట్లో ఒకరూమ్‌లో కిటికి వద్ద కూర్చొని, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా,ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆనందంగా గడుపొచ్చునంట, దీని వలన స్ట్రెస్ నుంచి భయపడతారు. అంతే కాకుండా,ఎప్పుడైతే మనం ఏమీ ఆలోచించకుండా బుర్రని ఖాళీగా ఉంచుతామో అప్పుడే మెదడులోని క్రియేటివిటీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అలా కొత్త ఆలోచనలు పుడతాయి. రొటీన్‌కి భిన్నంగా ఏదోటి చేయాలనిపిస్తుంది. దీంతో మనం కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా మనకు నచ్చినట్లు మనం బతుకొచ్చు.అయితే కొంతమంది చాలా రోజులుగా ఉద్యోగం చేస్తూ తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు.ఇంకొంత మంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఉంటారు. కాగా, అలాంటి వారు, ఏ పని లేకుండా కొంత కాలం ఏకాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా గడపొచ్చు. ఇలా ఏ పని లేకుండా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే ఇలా ఎక్కువ రోజులు ఉండటం అనేది మన మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల అధిక ఒత్తిడి అయినప్పుడు మాత్రమే రెండు లేదా మూడు నెలలు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలి అంటున్నారు నిపుణులు.