ఇంట్రెస్టింగ్ : ఆడవారికే కాదండోయ్.. ఇక్కడ జంతువులకు కూడా పీరియడ్స్ వస్తాయంట!

మహిళలకు పీరియడ్స్ అనేది సహజం. అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చాక వారికి పీరియడ్స్ అనేవి వస్తాయి. ఇక ఈ సమయంలో వారు మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే చాలా మంది మెన్సెస్ అనగానే

Update: 2024-05-02 04:52 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలకు పీరియడ్స్ అనేది సహజం. అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చాక వారికి పీరియడ్స్ అనేవి వస్తాయి. ఇక ఈ సమయంలో వారు మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే చాలా మంది మెన్సెస్ అనగానే ఈ సమస్య అమ్మాయిలకు మాత్రమే ఉంటుందని భావిస్తారు. కానీ కొన్ని రకాల జంతువులు, క్షీరదాలకు కూడా పీరియడ్స్ వస్తాయంట. ఏంటీ ఆడవారికే కాకుండా జంతువులకు కూడా రుతుక్రమం అనేది ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇదే నిజం అంటుంది డిస్కవర్ వైల్డ్ లైఫ్..అది చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఏ జంతువులు, క్షీరదాలకు పీరియడ్స్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా  డిస్కవర్ వైల్డ్ లైఫ్ కొన్ని క్షీరదాలు, జంతువులకు మనుషులలానే పీరియడ్స్ వస్తాయని తెలిపింది. గబ్బిలాలు,ష్రూలు, ఎలుకలుకు రుతుస్రావం వస్తుందంట కానీ ఇది వారిలో ప్రతి 33 రోజులకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. అదే విధంగా, కోతి కుంటుంబానికి చెందిన బాబూన్‌లకు ఆడవారిలానే పీరియడ్స్ వస్తుంటాయంట, కాకపోతే వీటికి ప్రతి 33 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా, పశ్చిమాసియా దేశాలలో కనిపించే రీసస్ మకాక్ కోతులు, అదే వింధంగా ఆడ చింపాజీలకు ప్రతి 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుందంట.అయితే ఈ చింపాజీలకు 60 సంవత్సరాల వరకు రుతుక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఈ జంతువులు, క్షీరదాలు ఆడవారిలానే పీరియడ్స్ అనే సమస్యను కలిగి ఉంటాయంట.

Read More..

Dogs: కుక్కలు కారు టైర్లు, గోడల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు

Tags:    

Similar News