Ancient cave: అడవిలో వెళ్తుండగా కనిపించిన గుహ.. లోపలికి తొంగి చూడగా..

Ancient cave: అడివిలో వెళ్తుండగా కనిపించిన గుహ.. లోపలికి తొంగి చూడగా!

Update: 2024-09-28 08:53 GMT

దిశ, ఫీచర్స్: అది ఆస్ట్రేలియాలోని దట్టమైన అడవీ ప్రాంతం. అల్లిబిల్లి పొదలతో, ఎత్తైన పర్వాతాలో, పారే సెలయేళ్లతో కనువిందు చేస్తోంది. చూడముచ్చటైన ప్రకృతి దృశ్యాలతో అలరిస్తోంది. పరిశోధనలో భాగంగా ‘క్లిఫోర్డ్ లా ట్రోబ్ యూనివర్సిటీ’కి చెందిన ఓ సైంటిస్టు తన శిష్య బృందంతో కలిసి ఇక్కడికి వచ్చాడు. పురావస్తు ఆధారాలు, పురాతన మానవ అవశేషాల కోసం వారంతా కలిసి వెతుకుతున్నారు. ఎంతకీ జాడ దొరకలే. కాసేపు రెస్ట్ తీసుకుందామని అందరూ ఒక చోట నిల్చుండగా.. ఎక్స్‌ప్లోరర్ క్లిఫోర్డ్ అనే పరిశోధకుడు మాత్రం మూత్ర విసర్జనకోసమంటూ పక్కకి వెళ్లాడు. కాగా ఈ సందర్భంలో అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆనందంతో పొంగిపోయాడు. ఎందుకంటే అతనికి ఓ పురాతన గుహ కనిపించింది.

అడవిలో గుహను చూడగానే తమ పరిశోధనకు అవసరమైన ఆధారాలు అక్కడ దొరుకుతాయని తెగ సంబరపడ్డాడు క్లిఫోర్డ్. వెంటనే తనతోపాటు వచ్చిన పరిశోధక విద్యార్థులను పిలిచాడు. అందరూ కలిసి గుహలోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా దాని లోపల పైభాగంలో కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నట్లు గుర్తించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపల తవ్వకాలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారు సుమారు 40 వేల ఏండ్ల నాటి వస్తువులు, పరికరాలు, జంతువుల ఎముకలు, మానవ కళేబరాలు, బొగ్గు, చెక్క అవశేషాలు, పురాతన ఆయుధాలను కనుగొన్నారు.

సైంటిస్టు క్లిఫోర్డ్ బృందం కనుగొన్న వస్తువుల్లో 33 వేల నుంచి 40 వేల సంవత్సరాల మధ్య కాలం నాటి గొడ్డలి కూడా ఉంది. అప్పటి ప్రజలు వేటకోసం దీనిని ప్రధాన ఆయుధంగా వాడినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. కాగా ఈ గుహ 10 వేల సంవత్సరాలుగా భూగర్భంలో కలిసిపోయి ఉందని కనుగొన్న శాస్త్రవేత్తలు అక్కడి పురాతన వస్తువులన్నీ సేకరించి సంరక్షించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పురాతన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా ఈ గుహ నిలిచిపోయింది. 


Similar News