బీర్ సీసాలతో నిర్మించిన అందమైన ఇల్లు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే (వీడియో)

కొంతమంది ఇంజినీర్లు వారి డిఫరేంట్ థింకింగ్‌తో జనాల్ని ఆశ్చర్యపరుస్తుంటారు.

Update: 2023-12-24 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది ఇంజినీర్లు వారి డిఫరేంట్ థింకింగ్‌తో జనాల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. పని తీరులో మరింత నైపుణ్యం, నిపుణులుగా రాణిస్తుంటారు. ఊహకు అందని విధంగా ప్రజల్ని అబ్బురపరుస్తారు. ఔరా అనిపిస్తుంటారు. ఇలాంటి ఓ సివిల్ ఇంజినీర్ గాజు సీసాలతో అద్భుతమైన ఇంటిని నిర్మించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బీరు సీసాలతో నిర్మించిన ఈ ఇల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరల్డ్ ఆఫ్ ఇంజినీర్స్ అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియోలో చూసినట్లైతే.. పలువరు ఇళ్ల నిర్మాణంలో బిజీగా ఉన్నారు.

గాజు సీసాలు, ఖాళీ డబ్బాలు ఉపయోగించి ఇళ్లు కడుతున్నారు. ఇళ్లు కట్టుకోడానికి ఇటుకలను ఎలా పేరుస్తారో.. ఇక్కడ బీర్ల సీసాలు అలా పేర్చుతున్నారు. తొలుత సిమెంట్ పొర, తర్వాత సీసాలు పెడుతూ క్రమ పద్ధతిలో ఆ ఇంటిని నిర్మించారు. గాజు సీసాలు, సిమెంట్‌తోనే పొడవైన, ఎత్తైన, మందపాటి గోడలు కట్టారు. ఇక ఫ్లోరింగ్ కోసం కూడా గాజు సీసాలనే ఉపయోగించారు. ఈ ఇంటిలో రెండు మూడు పెద్ద సైజు రూమ్స్‌ను కట్టారు.

ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అద్భుతమైన ఇల్లు, ఇంజినీర్ టాలెంట్‌కు హ్యాట్సాఫ్ అంటూ రకరకాలుగా కొనియాడుతున్నారు. ఇంజినీర్ ఆలోచన అద్భుతమైందని కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఈ ఇల్లును బార్ అంటారని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.


Similar News