Amla Tea : ఈ టీ గురించి తెలుసా?.. ఉదయాన్నే తాగితే ఆ ప్రాబ్లం క్లియర్!

గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీ, కాఫీ.. ఇలా రకరకాల పానీయాలు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో టీ తాగే అలవాటు ఉంటుంది.

Update: 2024-08-04 08:32 GMT

దిశ, ఫీచర్స్ : గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీ, కాఫీ.. ఇలా రకరకాల పానీయాలు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో టీ తాగే అలవాటు ఉంటుంది. ఎక్కువ మంది మాత్రం పాలు, టీ పొడి కలిపి తయారు చేసే టీని, ఆ తర్వాత కాఫీని తాగుతుంటారు. అయితే ఇవి ఎక్కువగా తాగినా.. నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు టీ తాగడం అంత మంచిది కాదని అంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలు కూడా ఉంటాయని, అలాంటి వాటిలో ఉసిరి టీ కూడా ఒకటని నిపుణులు పేర్కొంటున్నారు. దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం.

* డయాబెటిస్ పేషెంట్లకు ఉసిరి లేదా ఆమ్లా టీ చాలా మంచిదని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలతోపాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. డైలీ ఉదయాన్నే తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

* ఉసిరి కాయలో ఐరన్, విటమిన్ సి, కార్బో హైడ్రేట్లు, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని క్రోమియం అనే ఖనిజం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు రోజూ తాగడంవల్ల ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

* ఆమ్లా టీ తయారీ విధానం కూడా ఈజీనే ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగించాలి. అందులో ఒక చెంచా చొప్పున ఉసిరి పొడి, అల్లం పొడి లేదా అల్లం ముక్కను, కొన్ని పుదీనా ఆకులను వేసి కొద్దిసేపు మరిగించాలి. ఆ తర్వాత వడబోసి తాగాలి. ఇలా డైలీ ఆమ్లా టీని తాగితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News