Aliens: అర్ధరాత్రి కాగానే గ్రహాంతర వాసుల నుంచి మెసేజ్!.. వాళ్లంతా ఒక్కసారిగా లేచి..

దిశ, ఫీచర్స్: మనుషులు వివిధ మెసేజింగ్ యాప్‌లలో, ముఖ్యంగా వాట్సాప్‌లో సందేశాలు పంపుకోవడం కామన్. కానీ ఏలియన్స్ కూడా మెసేజెస్ పంపుతాయనే మాట మీరు విన్నారా?.. ప్రజెంట్ ఇలాంటి న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు నెటిజన్స్.

Update: 2024-07-15 15:17 GMT

దిశ, ఫీచర్స్: మనుషులు వివిధ మెసేజింగ్ యాప్‌లలో, ముఖ్యంగా వాట్సాప్‌లో సందేశాలు పంపుకోవడం కామన్. కానీ ఏలియన్స్ కూడా మెసేజెస్ పంపుతాయనే మాట మీరు విన్నారా?.. ప్రజెంట్ ఇలాంటి న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు నెటిజన్స్. నిజానికి ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు. బట్ దీనిపై ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తలే తాము స్వయంగా చూశామని చెప్తుంటారు. మరికొందరు నిజం కాదని అంటుంటారు. వాస్తవాలు ఎలా ఉన్నా గ్రహాంతర వాసుల ఉనికిపై ఇటీవల నెట్టింట జరుగుతున్న ఆసక్తికర చర్చ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అది రాత్రి 11:16 గంటల సమయం. యునైటెడ్ స్టేట్స్‌లోని ఓహియో ఆస్ట్రోనామికల్ సెంటర్‌లోని ల్యాబ్‌లో కొంతమంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నారు. అంతలోనే ల్యాబ్‌కు అమర్చ బడి ఉన్న ఓ ‘బిగ్ ఇయర్ టెలిస్కోప్’ నుంచి పెద్దగా శబ్దం రావడంతోపాటు అది రేడియో సిగ్నల్స్‌ను క్యాప్చర్ చేయడం ప్రారంభించింది. ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంతో అక్కడి సైంటిస్టులు వెంటనే లేచి నిలబడిపోయారు. అయితే బయట వినిపించే సాధారణ శబ్దాలకంటే కూడా 25 నుంచి 30 రెట్లు ఎక్కువగా సౌండ్ చేస్తూ, ఒక నిర్ధిష్ట కోడ్ త్రూ సిగ్నల్ 72 సెకన్లపాటు వస్తూనే ఉంది. ఆ తర్వాత ఆగిపోయింది.

అయితే ఇది ల్యాబ్‌లోని కంప్యూటర్లో 6 EQUJ5 సిగ్నల్ పేరుతో రికార్డయిందని, 1977, ఆగష్టు 15 నాడు రాత్రి ఈ ఘటన జరిగిందని, ఖగోళ శాస్త్రవేత్త ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జెర్రీ ఆర్. ఎహమాన్ (Jerry R. Ehman) పేర్కొన్నాడు. కాగా సదరు సిగ్నల్ 33 నిమిషాలకుపైగా తదేకంగా కొనసాగి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 72 సెకన్లు కంటిన్యూ అయిందని, ఇది రికార్డ్ అయిన డేటాలో ఉందని అతను పేర్కొన్నాడు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మరోసారి కొందరు ఏలియన్స్ ఉన్నట్లా?.. లేనట్లా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 


Similar News