Air Polution: గాలి కాలుష్యంతో మగవారిలో ఆ సమస్యలు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు !

Air Polution: గాలి కాలుష్యంతో మగవారిలో ఆ సమస్యలు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు !

Update: 2024-09-27 07:57 GMT

దిశ, ఫీచర్స్: చదువు, ఉద్యోగం, జీవనోపాధి.. కారణాలేమైనా పల్లెల్ని వదిలి పట్టణాలకు, నగరాలకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతోపాటు ఇక్కడ రోజు రోజుకూ జనాభా విస్తరిస్తోంది. పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం, వృక్ష సంపద తగ్గడం, పచ్చదనం లోపించడం, ట్రాఫిక్ పెరగడం వంటి కారణాలవల్ల సిటీల్లో వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం పెరుగుతున్నాయి. తరచుగా వీటికి గురికావడంవల్ల తలనొప్పి, ఊపిరి తిత్తుల సమస్యలు, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్, పలు ఇతర అనారోగ్యాలు తలెత్తుతాయని తెలిసిందే. కానీ ఒక అధ్యయనంలో మాత్రం షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం పురుషుల్లో సంతానలేమికి దారితీస్తుందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

హార్మోన్లపై ప్రభావం

దీర్ఘాకలిక వాయు కాలుష్యం, సిటీలో ట్రాఫిక్ వల్ల తరచూ వినిపించే రణగొణ ధ్వనులు పురుషుల్లో సంతానలేమి సమస్యలతో ముడిపడి ఉన్నాయని డెన్మార్క్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కలుషిత గాలిలో ఉండే అనేక సూక్ష్మ కణాలు, రసాయనాలను పట్టణాల్లో నివాసం ఉండేవారు పిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థల్లోకి చేరుతాయని, ఫలితంగా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయని అంటున్నారు. స్త్రీలలో అయితే అండాలు, పురుషుల్లో అయితే శుక్రకణాల సంఖ్య తగ్గడం, నాణ్యత దెబ్బతినడం వంటివి జరగొచ్చని చెప్తున్నారు.

శబ్ద కాలుష్యం కూడా..

ఇక వాహనాల రణ గొణ ధ్వనులు, ఇతర శబ్దకాలుష్యాలు కూడా ఆరోగ్యంమీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి స్ట్రెస్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయని, తర్వాత హర్మోన్లలో మార్పులకు కారణమై సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆరోగ్యం, నివాస ప్రాంతం, కుటుంబ పరిస్థితులను పరిశీలించారు. వీరిలో స్త్రీలు, పురుషులను కూడా వేర్వేరుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నవారు, సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణ అయిన వారు ఎవరు ఎక్కువగా ఉంటున్నారు? అందుకు కారణాలేమిటి? అనేది ఎనలైజ్ చేశారు. కాగా పురుషుల్లో, స్త్రీలల్లో కూడా వాయు, శబ్ద కాలుష్యాల ప్రభావం ఉన్నప్పటికీ వీరిపై భిన్నమైన ప్రభావం చూపుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు.

పురుషులపై ఎక్కువ ప్రభావం!

మగవారిలో గాలి కాలుష్యం PM 2.5 (fine particulate matter), మహిళల్లో వాహనాలు, ఇతర శబ్దకాల కాలుష్యం సంతానలేమికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించిన దానికంటే కూడా గాలిలో కాలుష్యం (పీఎం 2.5 మోతాదులు 1.6 రెట్లు ఎక్కువగా ఉండే పురుషుల్లో సంతానలేమి రిస్క్ 24 శాతం పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ తెలిపారు. ఇక స్త్రీలలో అయితే సగటు వాహనాలు లేదా శబ్ద కాలుష్యం (55 - 60 డెసిబెల్స్) కంటే 10.2 డెసిబెల్స్ పెరిగితే సంతానలేమి రిస్క్ 14 శాతం పెరుగుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందుకే కాలుష్యానికి దూరంగా ఉండాలని, ప్రజలు, ప్రభుత్వాలు దాని నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. 


Similar News