బ్రెయిన్ ఫంక్షన్‌పై ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్.. రెండు గంటల్లోనే..
ఎయిర్ పొల్యూషన్ మెదడు పనితీరును కొన్ని గంటల్లోనే దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది.
దిశ, ఫీచర్స్: ఎయిర్ పొల్యూషన్ మెదడు పనితీరును కొన్ని గంటల్లోనే దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఫంక్షనల్ కనెక్టివిటీలో అంతరాయాలు కలిగేందుకు.. మెదడుకు, డీజిల్ ఎగ్జాస్ట్‌కు కేవలం రెండు గంటల బహిర్గతం సరిపోతుందని తెలిపింది. సరళంగా చెప్పాలంటే వాయు కాలుష్యం కారణంగా మెదడులోని వివిధ భాగాలు పరస్పరం సంభాషించుకునే సామర్థ్యం తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు పరిశోధకులు.
వాంకోవర్ జనరల్ హాస్పిటల్‌లోని యూబీసీ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్‌పోజర్ లాబొరేటరీలో జరిగిన పరిశోధనలో భాగంగా.. మొత్తం 25 మంది వేర్వేరు సమయాల్లో డీజిల్ ఎగ్జాస్ట్, ఫిల్టర్ చేసిన గాలికి ఎక్స్‌పోజ్ అయ్యారు. ఈ క్రమంలో వారి మెదడు పనితీరును నిశితంగా పరిశీలించారు శాస్త్రవేత్తలు. ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ ఉపయోగించి బ్రెయిన్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేశారు. ఈ అధ్యయనం ప్రపంచంలోనే మొట్టమొదటిది కాగా.. వాయు కాలుష్యం, నాలెడ్జ్ మధ్య సంబంధాన్ని సమర్థించే తాజా సాక్ష్యాలను అందించింది. అయితే మెదడుపై వాయు కాలుష్య ప్రభావం తాత్కాలికమేనని, బహిర్గతం అయిన వెంటనే మెదడు పనితీరు సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. ఎక్స్‌పోజర్ నిరంతరంగా ఉంటే ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని హెచ్చరించారు.