డ్రైవర్ మాట విని వేల కోట్లు పోగొట్టుకున్న నటుడు.. లేదంటే ఆయన లెవల్ మరోలా ఉండేది..
‘పెళ్లి పందిరి’, ‘పెళ్లి’, ‘దేవుళ్లు’, ‘ప్రేయసి రావే’ వంటి సినిమాలతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న నటుడు పృథ్వీ 1990 టైమ్‌లో చాలా బిజీగా గడిపేవాడు. ఏడాదికి
దిశ, సినిమా : ‘పెళ్లి పందిరి’, ‘పెళ్లి’, ‘దేవుళ్లు’, ‘ప్రేయసి రావే’ వంటి సినిమాలతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న నటుడు పృథ్వీ 1990 టైమ్‌లో చాలా బిజీగా గడిపేవాడు. ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాడు. భారీ రెమ్యూనరేషన్ అందుకునేవాడు. దీంతో ప్రాపర్టీస్ కొనాలని నిర్ణయించుకున్నాడు. తెలిసిన ఓ ఫ్రెండ్‌ను కాంటాక్ట్ కాగా వందెకరాల భూమి చూయించి.. రూ. 10 లక్షలకే మొత్తం ఇచ్చేస్తానని, వెంటనే రిజస్ట్రేషన్ పనులు మొదలెడుతానని చెప్పాడు. ల్యాండ్ కూడా చూయించగా.. ఓకే అనుకున్నాడు పృథ్వీ.
అయితే ఇదే విషయాన్ని తన డ్రైవర్ దగ్గర చర్చించగా.. అతను నెగెటివ్‌గా మాట్లాడాడు. భూమిలో మొత్తం రాళ్లు ఉన్నాయని.. ఈ రాతి నేల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికే రూ. 20లక్షలు పడుతుందని చెప్పాడు. కొన్నదాని కన్నా దాన్ని బాగు చేసుకునేందుకు డబుల్ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని భయపెట్టాడు. దీంతో పృథ్వీ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ కట్ చేస్తే సీన్ మరోలా అయిపోయింది. ప్రస్తుతం ఆ భూమిలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు పడగా.. ఎకరం కోట్లు పలుకుతుంది. అంటే అలా చూస్తే వేల కోట్లకు అధిపతి అయిపోయేవాడు నటుడు. కానీ డ్రైవర్ వద్దనడంతో ఇప్పుడు చిన్న చిన్న అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నాడు. కాగా చివరగా పృథ్వీ.. ‘యానిమల్’లో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు.