‘స్లీప్ డివోర్స్’తో పెరుగుతున్న యాక్టివ్‌నెస్.. అసలు కారణం అదే!
‘స్లీప్ డివోర్స్’ అనే మాట మీరెప్పుడైనా విన్నారా?
దిశ, ఫీచర్స్ : ‘స్లీప్ డివోర్స్’ అనే మాట మీరెప్పుడైనా విన్నారా? కానీ హ్యాష్‌ట్యాగ్ స్లీప్ డివోర్స్ (#SleepDivorce) పేరిట ఈ మధ్య సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్ జరుగుతోంది. కారణాలేమైనా నిద్రించేటప్పుడు కపుల్స్ ఒకే మంచంపై కాకుండా వేర్వేరుగా నిద్రంచే ధోరణినే స్లీప్ డివోర్స్‌గా పేర్కొంటున్నారు. ఇలా చేయడంవల్ల స్లీప్ క్వాలిటీ పెరుగుతుందని, దానివల్ల యాక్టివ్‌గా ఉండగలుగుతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్లీప్ డివోర్స్‌పై భార్యా భర్తలు ఎందుకు మొగ్గ చూపుతున్నారని మానసిక నిపుణులు పరిశీలించినప్పుడు అందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలిసింది. అవేంటంటే.. సాధారణంగా ఇద్దరు కలిసి ఒకే మంచంపై పడుకున్నప్పుడు, ఒకరు గురకపెట్టడం, నిద్రలో కలవరించడం, కాళ్లు, చేతులు మీద వేయడం, బెడ్‌పై ప్లేస్ సరిపోకపోవడం జరుగుతుంటాయి. అలాగే కొందరికి లైటింగ్ ఇష్టమైతే, మరికొందరికి చీకటిగా ఉండటం ఇష్టంగా ఉంటాయి. తరచుగా ఇటువంటి పరిస్థితులు నిద్ర మేల్కొనేలా చేస్తున్నాయట. కొందరిలో ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. స్లీప్ డివోర్స్ వల్ల నాణ్యమైన నిద్రతోపాటు గురక, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి అనారోగ్యాలను దూరం అవుతాయని, యాక్టివ్ నెస్ పెరుగుతుందని నిపుణుల అబ్జర్వేషన్‌లో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి: