మీ చుట్టూ ఉండే అబద్ధాలకోరును ఇలా పట్టేయొచ్చు...

మన జీవితంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. నమ్మినవారే ద్రోహం చేస్తారు. ఇన్నోసెంట్ అనుకున్న వ్యక్తులే వెన్నుపోటు పొడుస్తారు. అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకుంటారు. కానీ నిజంగా ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు కావచ్చు.. కాకపోవచ్చు.. అనే సందిగ్ధంలో ఉండిపోతాం. అడిగితే

Update: 2024-07-15 17:05 GMT

దిశ, ఫీచర్స్: మన జీవితంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. నమ్మినవారే ద్రోహం చేస్తారు. ఇన్నోసెంట్ అనుకున్న వ్యక్తులే వెన్నుపోటు పొడుస్తారు. అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకుంటారు. కానీ నిజంగా ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు కావచ్చు.. కాకపోవచ్చు.. అనే సందిగ్ధంలో ఉండిపోతాం. అడిగితే ఏమనుకుంటారో అని మనని మనమే సముదాయించుకుంటాం. కానీ అలా కాకుండా.. మీరు అనుమానిస్తున్న వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో గుర్తించి, అబద్ధం చెప్తున్నారో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఒక అబద్ధాలకోరు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తారో చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

  • ఒక వ్యక్తి నిజంగా అబద్ధం చెప్తున్నట్లయితే.. చెప్పే కథలు, వివరాల్లో స్థిరత్వం ఉండదు. ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు స్టోరీస్ మారిపోతూ ఉంటాయి. పదే పదే ప్రశ్నిస్తే గందరగోళం చెందుతారు. తప్పులు చేయడం ప్రారంభిస్తారు.
  • నిలబడే, కూర్చునే విధానం తేడాగా ఉంటుంది. ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడేందుకు జంకుతారు.
  • మాట్లాడుతున్నప్పుడు వాడే పదాలు, నిజమైన భావోద్వేగాల మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ముఖ కవళికలు అసంకల్పితంగా ఉంటాయి. ఉమ్, ఉహ్ లాంటి పదాలను తరుచుగా వాడుతారు.
  • వాయిస్ పిచ్ లోనూ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే వారు భయం, ఆందోళన, ఒత్తిడికి గురవుతారు. ఈ మార్పు చిన్నదే అయినా వ్యక్తి అన్ కంఫర్ట్ గా ఉన్నాడని.. మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మనకు తెలిసిపోతుంది.
  •  ఒక ప్రశ్న అడిగినప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పుదారి పట్టిస్తుంటారు. ఆ సందర్భం గురించి మాట్లాడకుండా అరిచేస్తారు. ఆ సమయంలో సేవ్ అయ్యామని ఫీల్ అయిపోతారు. కానీ ఎదుటివారు లయ్యర్ అని క్యాచ్ చేస్తారు.
  • ఇక మరికొందరు జరిగిన విషయమేంటో చెప్పమని అడిగితే అతిశయోక్తితో మాట్లాడుతారు. అదనపు వివరాలు అందిస్తూ.. వారు చెప్పిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అనవసరమైన సమాచారం చెప్తూ అతిగా మాట్లాడుతారు.
  • ఒక వ్యక్తి నిజం చెప్పనప్పుడు.. తను చెప్పిన అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నంలోనే ఉండిపోతాడు. మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటాడు. ఒక్కోసారి ఆన్సర్ ఇచ్చేందుకు కూడా వెనుకాడుతాడు.

Similar News