మూడు సెకన్లకో బిడ్డకు జననం.. 25 ఏళ్లు ఇదే పనిలో ఉంటుది...

ప్రతీ జీవి బిడ్డలకు జన్మనిచ్చే విషయంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని జీవులు సంవత్సరాలపాటు బిడ్డను కడుపులో మోస్తే కొన్ని నెలలు, రోజులు, నిముషాల తర్వాతే పిల్లలకు జన్మనివ్వవచ్చు. ఇక చెదపురుగు విషయానికి వస్తే జస్ట్ మూడు సెకన్లకు ఒక బిడ్డను కంటుంది.

Update: 2024-09-16 15:46 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతీ జీవి బిడ్డలకు జన్మనిచ్చే విషయంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని జీవులు సంవత్సరాలపాటు బిడ్డను కడుపులో మోస్తే కొన్ని నెలలు, రోజులు, నిముషాల తర్వాతే పిల్లలకు జన్మనివ్వవచ్చు. ఇక చెదపురుగు విషయానికి వస్తే జస్ట్ మూడు సెకన్లకు ఒక బిడ్డను కంటుంది. 24 గంటలు.. 25 ఏళ్ల పాటు అదే పనిలో ఉంటుంది. ఇక చెదపురుగులు మానవులపై అనేక ప్రభావాలను కలిగి ఉంటాయి. వెనిజులాలోని ఆల్టో ఒరినోకో ప్రావిన్స్‌లోని మకిరిటరే వంటి కొన్ని సంస్కృతుల ఆహారంలో రుచికరమైన స్నాక్స్ గా ఉన్నాయి. ఇక్కడ వాటిని సాధారణంగా మసాలాగా కూడా ఉపయోగిస్తారు.

ఇన్ఫ్లుఎంజా , ఉబ్బసం , బ్రోన్కైటిస్ మొదలైన వివిధ వ్యాధులు, సాంప్రదాయ ఔషధ చికిత్సలలోనూ వీటిని ఉపయోగిస్తారు. ఏది ఏమైనప్పటికీ... చెదపురుగుల జాతులలో ఎక్కువ భాగం హానికరం కాదు, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, వెస్టిండీస్ లో ఉండే ఈ జాతి పురుగుల్లో ఇంతకు ముందు నిర్మాణాత్మకంగా నష్టపరిచేవి కూడా ఉండేది కానీ వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్ల జాతి అంతరించిపోయిందని తెలుస్తుంది. పట్టణీకరణ, కనెక్టివిటీ ముఖ్యంగా వీటిపై అధికంగా ఎఫెక్ట్ చూపిందని చెప్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News