Space Tourism : ఇకపై అంతరిక్షయానం సులభం.. అందుబాటులో టికెట్ ధరలు
గోపీచంద్ తోటకూర మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. బ్లూ ఆరిజిన్ కు సంబంధించిన న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణాన్ని పూర్తి చేసిన ఆయన జర్నీ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుండగా.. ఈయన ప్రయాణం స్పేస్ టూరిజంపై ఆసక్తి పెరిగేలా చేసింది
దిశ, ఫీచర్స్ : గోపీచంద్ తోటకూర మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. బ్లూ ఆరిజిన్ కు సంబంధించిన న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణాన్ని పూర్తి చేసిన ఆయన జర్నీ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుండగా.. ఈయన ప్రయాణం స్పేస్ టూరిజంపై ఆసక్తి పెరిగేలా చేసింది. కానీ ధరల మాటేంటి? ఈ రంగంలో కూడా పోటీ పెరుగుతుందా? ప్రయాణ ఖర్చులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం.
టికెట్ అండ్ ఎక్స్ పీరియన్స్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్.. స్పేస్ టూరిజం ఆఫర్ చేస్తుంది. కానీ ఇందుకు సంబంధించిన నిర్ణీత ధరను ఓపెన్ గా వెల్లడించలేదు. న్యూ షెపర్డ్ విమానానికి సంబంధించిన ముందస్తు టిక్కెట్లు దాదాపు రూ. 240 కోట్లకు వేలం వేయబడ్డాయి. ఒక సీటు ధర ఇంతకు ముందు రూ. 40 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 10 లక్షల్లో అంతరిక్షయానం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఇందులో జర్నీ ప్రయాణికుడికి కొద్ది నిమిషాల పాటు మైక్రోగ్రావిటీ, అంతరిక్షం నుంచి భూమి ఎలా ఉంటుందనే వ్యూ చూపిస్తారు. ఇక స్పేస్ టూరిజం మార్కెట్ డెవలప్మెంట్ కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో ధరలు తగ్గినట్లు చెప్తున్నారు.
మార్కెట్ పోటీ
బ్లూ ఆరిజిన్ కు పోటీ ఇస్తున్న వర్జిన్ గెలాక్టిక్ సుమారు మూడు కోట్ల టిక్కెట్ ధరలతో సబ్ ఆర్బిటాల్ విమానాలను అందిస్తుంది, బ్లూ ఆరిజిన్ మిషన్‌లతో పోలిస్తే ఇందులో భిన్నమైన అనుభవం ఉంటుంది. SpaceX ఇంకా సాధారణ పర్యాటక విమానాలను అందించనప్పటికీ.. వారి అధునాతన సాంకేతికత, పెద్ద ఎత్తున కార్యకలాపాలు భవిష్యత్తులో తక్కువ ధరలకు దారితీయవచ్చు. దీంతో మిగతా కంపెనీలు కూడా ఇదే ఫాలో కావాల్సి ఉండొచ్చు.
ఖర్చు ప్రభావితం అంశాలు
అయితే అనేక అంశాలు ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణ ఖర్చును ప్రభావితం చేస్తాయి. న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ రీయూజ్ కోసం రూపొందించబడినప్పటికీ.. దాని డెవలప్మెంట్, ధృవీకరణ ఖర్చులు ఎక్కువ. ప్రతి ప్రయోగానికి ఇంధనం, నిర్వహణ, సిబ్బంది శిక్షణతో సహా గణనీయమైన ఖర్చులు ఉంటాయి. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించక తప్పదు.
అంతరిక్ష పర్యాటకంపై మిశ్రమ స్పందనలు ఉన్నాయి. కొందరు దీనిని గొప్ప విజయంగా భావిస్తే.. మరికొందరు అధిక ఖర్చుల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా అంతరిక్ష పర్యాటకం విస్తృత సమాజానికి ప్రయోజనం చేకూర్చే సాంకేతిక ఆవిష్కరణలు, పురోగతులకు కారణం అవుతుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
ఉపాధి.. మార్గదర్శకం..
గోపీచంద్ తోటకూర అంతరిక్షయానం ప్రైవేట్ స్పేస్ టూరిజంకు సంబంధించిన అధిక ధరను నొక్కి చెబుతుంది. అయితే పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు,
టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు.. వ్యయాలు తగ్గవచ్చు. అంతరిక్ష ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతానికి ఈ మైలురాయి అంతరిక్ష పర్యాటకం మార్గదర్శక స్వభావం, అటువంటి ప్రయాణాలకు అవసరమైన గణనీయమైన ఆర్థిక నిబద్ధత రెండింటినీ హైలైట్ చేస్తుంది.