ఆకాశంలో వింత.. ఆరోజు ఒకేసారి ఆరు గ్రహాలను చూసేయొచ్చు..

Update: 2024-06-01 10:24 GMT

దిశ, ఫీచర్స్: సౌర వ్యవస్థలో ఉన్న ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయన్న సంగతి తెలిసిందే. వేర్వేరు వేగాలతో తిరిగే గ్రహాలు కొన్నిసార్లు ఒకే లైన్ లో ఉన్నట్లుగా కనిపిస్తాయి. దీన్ని ' planet Parade ' అని పిలుస్తారు. కాగా ఇలాంటి వింత ఆకాశంలో జరుగబోతుందని పలు ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. జూన్ 3న ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే లైన్ లో రాబోతున్నాయని.. వీటిని ఈజీగా కంటితో భూమి నుంచి చూడవచ్చని వివరించాయి.

శని, బృహస్పతి, మెర్క్యురీ, యురేనస్, మార్స్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో వరుసగా కనిపించబోతున్నాయని ఇప్పటికే తెలిసింది. అయితే NASA మాత్రం రెండు గ్రహాలు( శని, అంగారకుడు) మాత్రమే చూడగలమని క్లారిటీ ఇచ్చింది. బృహస్పతి, మెర్క్యురీ హోరిజోన్ వద్ద లేదా దాని క్రింద ఉంటాయి. కాబట్టి వాటిని చూడటం అసాధ్యం. యురేనస్, నెప్ట్యూన్ చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటిని చూసేందుకు టెలిస్కోప్ తో చూడాల్సి ఉంటుంది. అయితే ఆకాశంలో ఈ వింతను చూడలేని వారికి మరో శుభవార్త చెప్పింది NASA. జూన్ 29 న శని, చంద్రుడు, మార్స్, బృహస్పతి ఉదయం ఆకాశంలో ఒకే సమయంలో వరుసగా వచ్చాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ దృగ్విషయం జూలై వరకు కొనసాగుతుంది.


Similar News