కోమాలో ఉన్న పేషెంట్స్‌కు పీరియడ్స్ వస్తాయా?
కార్డియాక్ అరెస్ట్, మధుమేహం, కాలేయం, మూత్రపిండ వైఫల్యం, డ్రగ్స్, ఆల్కహాల్ మితిమీరిన వినియోగం, విద్యుదాఘాతం, టాక్సిన్ బహిర్గతం, స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ (TBI) లాంటి పరిస్థితులు..
దిశ, ఫీచర్స్ : కార్డియాక్ అరెస్ట్, మధుమేహం, కాలేయం, మూత్రపిండ వైఫల్యం, డ్రగ్స్, ఆల్కహాల్ మితిమీరిన వినియోగం, విద్యుదాఘాతం, టాక్సిన్ బహిర్గతం, స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ (TBI) లాంటి పరిస్థితులు.. కోమాకు కారణం అవుతుంది. వ్యక్తి స్పందించని, మేల్కొనలేని పాక్షిక స్పృహ స్థితికి దారితీస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళకు పీరియడ్స్ వస్తాయా అనేది ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న ప్రశ్న. కాగా ఇందుకు నిపుణులు చెబుతున్న సమాధానం ఏంటో చూద్దాం.
పునరుత్పత్తి వ్యవస్థ ఎటువంటి గాయం లేకుండా పనిచేస్తుంటే.. స్త్రీ కోమాలో ఉన్నా ఋతుస్రావం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అటువంటి సందర్భంలో శరీరం దాని సాధారణ పనితీరుతో కొనసాగుతుంది. కోమాలోకి వెళ్లే ముందు నెలవారీ రుతుక్రమం సరిగ్గా ఉంటే.. అదే కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమంది స్త్రీలకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం లేదా PCOS వంటి ఇతర రుగ్మతల వల్ల రక్తప్రసరణ తక్కువగా ఉండవచ్చు. పీరియడ్అనేది సహజమైన దృగ్విషయం. కాగా ఇతర ఆరోగ్య సమస్యలు లేకుంటే కోమాలో కూడా దీనిని పొందుతారని చెప్తున్నారు.
ఎందుకంటే కోమాలో ఉన్న వ్యక్తిలో మెదడు ప్రభావితమవుతుంది కానీ పునరుత్పత్తి అవయవాలు కాదు. కాబట్టి మహిళలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి నెలవారీ పీరియడ్స్ కలిగి ఉంటారు. మూత్రవిసర్జన, మలవిసర్జన వంటి ఇతర శారీరక విధులు కూడా కోమాలో జరుగుతూనే ఉంటాయి. మోటారు కదలికలు, సంచలనాలు, ప్రసంగం, దృష్టి, వినికిడి మొదలైన విధులను మెదడు నియంత్రిస్తుంది. కాబట్టి కోమాలో ఉన్న వ్యక్తి చేతులు, కాళ్ళను కదల్చలేరు. సంచలనాలను అనుభవించలేరు. చూడలేరు. వినలేరు. కానీ పీరియడ్స్ వంటి కొన్ని విధులు మెదడుచే నియంత్రించబడవు.