చిన్నప్పుడే డెవలప్ అవుతున్న అహంకారం

ఈగో.. అహం.. అనేది చిన్నతనంలోనే ఏర్పడుతుంది. ప్రపంచంతో మన కమ్యూనికేషన్ ద్వారా బిల్డ్ అవుతుంది. విభిన్నమైన ఆలోచనలు, భావాలు కలిగిన మనల్ని మనం వేరుగా గుర్తించినప్పుడు పటిష్టం అవుతుంది. విలువ,

Update: 2024-06-10 11:58 GMT

దిశ, ఫీచర్స్: ఈగో.. అహం.. అనేది చిన్నతనంలోనే ఏర్పడుతుంది. ప్రపంచంతో మన కమ్యూనికేషన్ ద్వారా బిల్డ్ అవుతుంది. విభిన్నమైన ఆలోచనలు, భావాలు కలిగిన మనల్ని మనం వేరుగా గుర్తించినప్పుడు పటిష్టం అవుతుంది. విలువ, యోగ్యత, గుర్తింపు భావాలను పెంపొందిస్తుంది. ఇదే నేను అని చెప్తూ.. అదే పద్ధతిని జీవితాంతం ఫాలో అయ్యేలా చేస్తుంది.

కమ్యూనికేషన్ లో కీలకం

మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో నిర్ణయించేది కూడా అహం మాత్రమే. కాగా ఆరోగ్యకరమైన సరిహద్దులను కంటిన్యూ చేస్తూనే.. ఇతరుల పట్ల సానుభూతితో ఉండేలా బ్రెయిన్ ను గైడ్ చేస్తుంది. సొసైటీలో గుర్తింపు, ఆమోదం కోరుతూ సామాజిక పరిస్థితులను నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. పక్క వారితో పోలిక, పోటీని క్రియేట్ చేయడంలో కీలకం అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడంలో హెల్ప్ చేస్తుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ లెన్స్ తో సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఎలా రియాక్ట్ కావాలో చెప్తుంది. హెల్తీ ఈగో మన కోసం మనం నిలబడుతూనే ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తే.. పెరిగిన అహం రిలేషన్ షిప్స్ ను దెబ్బతీస్తుంది. సమాజం, సంప్రదాయం కూడా అహం పెరగడానికి కారణాలు కాగా సొసైటీలో వారి స్టేటస్ ను బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది.

* భావోద్వేగ మద్దతు :

నిజానికి అహంతో ఆరోగ్యకరమైన బంధాలను క్రియేట్ చేసుకుంటే ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది. భావోద్వేగ మద్దతు దొరుకుతుంది.

* స్వీయ-అవగాహన:

అహం మీలోని ఆలోచనలు, ప్రవర్తనలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరితో మాట్లాడేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోండి.

*అంగీకారం:

మీ బలాలు, బలహీనతలు రెండింటినీ గుర్తించండి. లోపాలను యాక్సెప్ట్ చేయండి. అప్పుడే ఒకరితో బంధాన్ని ఏర్పరుచుకోగలరు.

*కనికరం.. అభివృద్ధి

ఇతరుల పట్ల మాత్రమే కాదు మీకు మీరు దయగా ఉండండి. సమాజం పట్ల అవగాహన పెంచుకోండి. సవాళ్లను జీవితంలో ఎదిగేందుకు ఉపయోగించండి. అహంతో ఇతరులను బ్లేమ్ చేసేందుకు ప్రయత్నించకూడదు.

* బ్యాలెన్స్

కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మధ్య బ్యాలెన్స్ మెయింటేన్ చేయండి. మీ లిమిట్స్ మెయింటేన్ చేస్తూనే ఇతరులతో వినయంగా ఉండండి. విలువ ఇవ్వండి.


Similar News