ఫాంటసీలో బతికేస్తున్నారా? అదే కంటిన్యూ చేస్తే ఇకపై బతకలేరు..
నిత్యం సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయినప్పుడు.. ఈ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్లో చాలా మంది అలా జరిగితే బాగుండు.. ఇలాంటివి అనుభవిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా అనుకుంటూ ఫాంటసీలో బతికేస్తారు.
దిశ, ఫీచర్స్: నిత్యం సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయినప్పుడు.. ఈ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్లో చాలా మంది అలా జరిగితే బాగుండు.. ఇలాంటివి అనుభవిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా అనుకుంటూ ఫాంటసీలో బతికేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పగటి కలలు కంటారు. అయితే ఇలాంటి ఫాంటసీలు ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుందని కానీ పదేపదే అయితే మాత్రం మానసిక అనారోగ్యం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలా కాకుండా ప్రపంచానికి మరింత దగ్గరగా రియాలిటీలో బతకాలని సూచిస్తున్నారు. అలాంటప్పుడే అయోమయంలో జీవించడం మానేసి.. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారని, జీవితాన్ని వాస్తవికతలో ఆస్వాదించగలుగుతారని చెప్తున్నారు.
ఎందుకు ఫాంటసీలో బతుకుతారు?
ఫాంటసీలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్య రుగ్మత ఫాంటసైజింగ్‌కు దారితీయవచ్చు. పారానోయిడ్ పర్సనాలిటీ డిజార్డర్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ తోపాటు నిరాశ, ఆందోళన వంటి మానసిక వ్యాధుల వల్ల కూడా ఏర్పడొచ్చు. భాగస్వామితో ప్రాబ్లమ్స్, కుటుంబ సంబంధాలలో సమస్యలు, ఒకరిపై మొహం ఈ పరిస్థితిలో చిక్కుకునేలా చేయవచ్చు. ఇక కొందరిలో సహజంగానే ఉండే ఆత్రుత, అతిగా ఆలోచించడం ఫాంటసీలో జీవించేందుకు కారణం అవుతాయని చెప్తున్నారు నిపుణులు. దీన్ని ఆపేందుకు చిట్కాలు అందిస్తున్నారు.
మైండ్ ఫుల్నెస్
ఫండమెంటల్ హ్యూమన్ కెపాసిటీ ప్రకారం బాడీ, మైండ్ రెండు కూడా ప్రజెంట్ ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలు, చర్యలకు కట్టుబడి ఉండాలి. ఓవర్ రియాక్షన్ అవాయిడ్ చేయాలి. దీన్నే మైండ్ పుల్నెస్ అంటారు. ఎలాంటి జడ్జిమెంట్స్ పాస్ చేయకుండా మన వైఖరులు, మనోభావాలు, ప్రవర్తనలు, పరిసరాలను స్వీకరించాలి. ప్రకృతిలో మమేకం అయిపోవడం, యోగా, ధ్యానం, నచ్చినది తినడం, ఇష్టమైన సంగీతం వినడం, మూవీ చూడటం, సువాసనను ఆస్వాదించడం వంటివి చేస్తూ ఇంద్రియాలు కంట్రోల్ లో ఉండేలా .. ఊహల్లో తేలిపోకుండా చూసుకోవాలి.
ధ్యానం
ఒత్తిడికి లోనవుతూ ఎక్కువగా ఆలోచించే పరిస్థితిలో ఉంటే.. శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామం, ధ్యానం, శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా శాంతిని పొందుతారు. ఎమోషన్స్, థాట్ ప్రాసెస్ ను కంట్రోల్ చేయగలుగుతారు. మితిమీరిన ఆలోచన , పగటి కలలను తగ్గించడంలో ధ్యానం హెల్ప్ అవుతుంది.
టార్గెట్స్ సెట్ చేయండి
పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్.. రెండింటిపై సమానంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా అనవసర విషయాల గురించి ఆలోచించడం తగ్గిస్తారు. తద్వారా ఫాంటసీలు, పగటి కలలు లాంటివి ఉండవు. ముఖ్యంగా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో టార్గెట్స్ సెట్ చేసుకున్నప్పుడు, వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ అంశాలపైనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి డే డ్రీమ్స్ కు దూరంగా ఉంటారు.
రిలేషన్షిప్ లో క్లారిటీ
కొన్ని సంబంధాల్లో స్పష్టత ఉండదు. ఒకరు ఫ్రెండ్ అనుకున్నప్పుడు.. ఎదుటి వ్యక్తి లవర్ అనుకోవచ్చు. త్వరలో భాగస్వాములుగా మారిపోతామనే ఊహల్లో బతికేయొచ్చు. ఇలాంటి పగటి కలలు కంటున్నప్పుడు తమకు నచ్చిన విధంగా ఉంది కాబట్టి డోపమైన్, సెరొటోనిన్ అని పిలువబడే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల సంతోషంగా ఉంటారు. ఆటోమేటిక్ గా అలా ఫాంటసీ చేసుకోవడాన్ని ఇష్టపడుతారు. కానీ ఏదో ఒక సమయంలో నిజం తెలిసినప్పుడు.. హార్ట్ బ్రేక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ముందుగా బంధంపై స్పష్టత తీసుకోవడం మంచిది. అప్పుడే ఆ రిలేషన్ ను ముందుకు తీసుకువెళ్ళాలా లేక ముగించాలా అనే క్లారిటీ కూడా వస్తుంది.
జర్నలింగ్
ఫాంటసైజింగ్ అనేది ఆత్మవంచనే అవుతుంది. తప్పు చేస్తున్నామని తెలిసినా తప్పక చేస్తుంటారు. దీని నుంచి బయటకు రావాలంటే మీ ఫాంటసీని పేపర్ పై పెట్టడం లేదా రికార్డు చేసుకుని వినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అవి చదివినప్పుడు లేదా విన్నప్పుడు మీ మెదడులో ఆలోచనలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. మీరు చేస్తుంది తప్పో ఒప్పో మీకే స్వయంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒకరి ముందు మీరు తప్పు చేసిన వాళ్ళుగా మారడం కానీ, తల దించుకోవడం కానీ జరగదు.