బాయ్ ఫ్రెండ్ బ్లష్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ హ్యాక్

సోషల్ మీడియా కొత్త బ్యూటీ ట్రెండ్ ను సెట్ చేసింది. 'బాయ్ ఫ్రెండ్ బ్లష్ ' అంటూ కొత్త బ్యూటీ టెక్నిక్ తీసుకొచ్చింది. ఇప్పటికే 84.8M వ్యూస్ సంపాదించి, గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ ప్లేస్ లో దూసుకుపోతుంది.

Update: 2024-06-30 15:11 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా కొత్త బ్యూటీ ట్రెండ్ ను సెట్ చేసింది. 'బాయ్ ఫ్రెండ్ బ్లష్ ' అంటూ కొత్త బ్యూటీ టెక్నిక్ తీసుకొచ్చింది. ఇప్పటికే 84.8M వ్యూస్ సంపాదించి, గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ప్రిన్సెస్ డయానా ఎర్లీ లుక్ నుంచి స్ఫూర్తి పొందిన ఈ ట్రెండ్ ఏంటి? ఎందుకు అంతగా వైరల్ అవుతుంది? చూద్దాం.

ఎక్సర్ సైజ్ చేశాక మన ఫేస్ లో స్పెషల్ గ్లో వస్తుంది. అలాంటి సహజమైన మెరిసే రూపాన్ని మిమిక్ చేసేందుకు.. చెంపలకు కొంచెం కిందగా బ్లష్ అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఈ టెక్నిక్ అందరికీ సూట్ అయ్యే నేచురల్ గులాబీ రంగును అందిస్తుంది. ముఖాన్ని చక్కగా చెక్కినట్లుగా అందమైన రూపాన్ని ఇస్తుంది. ప్రిన్సెస్ డయానా యంగ్ ఏజ్ లో ఇదే పద్ధతి ఫాలో అయ్యేది. కాగా ఇందుకు క్రీమ్ బ్లష్ లు అనువైనవి. చర్మంలో సహజంగా కలిసిపోతాయి. షిమ్మరీ, గ్లిట్టరీ అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే మెరుపు సహజత్వాన్ని పోగొడుతుంది. మొత్తానికి యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో బాయ్ ఫ్రెండ్ బ్లష్ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ఇంకేం మీ మేకప్ రొటీన్‌కి సహజ సౌందర్యాన్ని తీసుకురావడానికి ఈ ట్రెండ్‌ను స్వీకరించండి. ఎంజాయ్ చేయండి.


Similar News